PHOTO STORIES

HEALTH & FITNESS

నోట్ల రద్దు తరువాత ప్రజలకు మరో శుభవార్త చెప్పిన ఎస్ బి ఐ...!

నోట్ల రద్దు తరువాత ప్రజలకు మరో శుభవార్త చెప్పిన ఎస్ బి ఐ...!

నోట్ల రద్దు తరువాత ప్రజలు నగదు కోసం నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ ఇబ్బందులు కొంచెం తగ్గుతున్న తరుణంలో ప్రజలకు ఎస్ బి ఐ మరో తీపి కబురు అందించింది. నోట్ల రద్దు తరువాత మొదలైన కష్టాలు మరో ఆరు నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆర్ధిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్చి నెల చివరి వరకూ కష్టాలు తప్పకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అయితే తాజాగా ఈరోజు ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల చివరికల్లా నోట్ల కష్టాలకు పుల్‌స్టాప్ పడుతుందంటూ తీపికబురు చెప్పారు.

ఫిబ్రవరి తొలివారం నుంచే పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటాయని, నెలాఖరు నాటికి పూర్తిగా సమసిపోతాయని పేర్కొన్నారు. నగదు కోసం క్యూలలో నిలబడే పరిస్థితి ఉండదని, దీనికి తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకు బ్రాంచిలకు సరిపడా డబ్బులు పంపిస్తున్నామని, దీనివల్ల ఖాతాదారులు కావాల్సినంత సొమ్మును డ్రా చేసుకోవచ్చని వివరించారు. నోట్లు మళ్లీ చలామణిలోకి వస్తాయని, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు వద్దని అరుంధతి పేర్కొన్నారు.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS