PHOTO STORIES

HEALTH & FITNESS

సంక్రాంతికి ప్రత్యేక రైళ్ళు...ప్రయాణీకులకు ఊరట...!

సంక్రాంతికి ప్రత్యేక రైళ్ళు...ప్రయాణీకులకు ఊరట...!

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు...నగరాల్లో ఉన్న ప్రతీ ఒక్కరు తమ సొంత ఊర్లకు బయలుదేరి వెళ్తుంటారు. దీంతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హౌరా, భువనేశ్వర్‌ వైపు నడిచే రైళ్లకు కనీసం నిరీక్షణ జాబితాలో టికెట్‌ లభించే పరిస్థితి లేదు. ఇక సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు చాంతాడంత నిరీక్షణ జాబితా నెలకొంది. విజయవాడ వెళ్లే జన్మభూమి, సింహాద్రి వంటి ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లకు మంగళవారం నుంచి మూడు రోజులపాటు సీట్లు నిండిపోయాయి. ఇక రత్నాచల్‌ ఇంటర్‌ సిటీకి కూడా బుధ, గురు వారాల్లో సీటు లభించే పరిస్థితి లేదు. శాశ్వత ప్రాతిపదికన నడుస్తున్న సుమారు అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు బెర్తులు, సీట్లు నిండిపోయా నిరీక్షణ జాబితా లేదా రిగ్రెట్‌ ఏర్పడడంతో సంక్రాంతి ప్రయాణికులు ప్రత్యేక రైళ్లను ఆశ్రయించే పనిలో పడ్డారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో మంగళవారం నుంచి ప్రయాణాలు ఊపందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి, విశాఖ మీదుగా పలు ప్రాంతాలకు రైల్వే అధికారులు ప్రవేశపెట్టిన పలు ప్రత్యేక రైళ్ల వివరాలు.

ప్రత్యేక రైళ్ల వివరాలు
విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ
08501 (ప్రతిమంగళవారం) జనవరి మూడు నుంచి 31 వరకు రాత్రి 11.00 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. 08502 (బుధవారం) జనవరి నాలుగు నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 4.50 గంటలకు విశాఖ చేరుతుంది.

విశాఖ-తిరుపతి-విశాఖ
08573 (ప్రతి సోమవారం) జనవరి రెండు నుంచి 23 వరకు రాత్రి 10.55 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 1.25 గంటలకు తిరుపతి చేరుతుంది. 08574 (ప్రతి గురువారం) జనవరి మూడు నుంచి 24 వరకు మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి మర్నాడు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుతుంది.

టాటానగర్‌-విశాఖ-టాటానగర్‌
08189 (ప్రతి శుక్రవారం) మధ్యాహ్నం 1.00 గంటలకు టాటానగర్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 5.25 గంటలకు విశాఖ చేరుతుంది. 08190 సాయంత్రం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు ఉదయం 10.45 గంటలకు టాటానగర్‌ చేరుతుంది. ఈ సర్వీసులు జనవరి 28వరకు అందుబాటులో వుంటాయి.

యశ్వంత్‌పూర్‌-విశాఖ-యశ్వంత్‌పూర్‌ తత్కాల్‌ స్పెషల్‌
06579 తత్కాల్‌ ప్రత్యేక రైలు. ఈ నెల జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి 24 వరకు (ప్రతి శుక్రవారం) సాయంత్రం 6.35 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 06580 నంబరు గల వారాంతపు తత్కాల్‌ ప్రత్యేక రైలు జనవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి 26 వరకు (ప్రతి ఆదివారం) మధ్యాహ్నం 1.45 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు ఉదయం 9.05 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుతుంది.

దువ్వాడ మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లు
కాచిగూడ-టాటానగర్‌
07438 (ప్రతి సోమవారం) మధ్యాహ్నం 1.00 గంటలకు కాచిగూడలో బయలుదేరి మర్నాడు ఉదయం 1.30 గంటలకు విశాఖ చేరి తిరిగి ఇక్కడ నుంచి 1.50 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 27 వరకు అందుబాటులో వుంటుంది. తిరుగు ప్రయాణంలో 07439 (ప్రతి మంగళవారం) రాత్రి 10.50 గంటలకు టాటానగర్‌లో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖ చేరి తిరిగి 3.30 గంటలకు వస్తుంది.

డిబ్రుగర్‌, చెన్నై మధ్య ప్రత్యేక రైలు
05906 (మంగళవారం) ఈ నెల మూడు, పదో తేదీన రాత్రి 11.45 గంటలకు డిబ్రుగర్‌లో బయలుదేరి గురువారం ఉదయం 7.28 గంటలకు దువ్వాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 05905 ఈ నెల ఏడు, 14న (శనివారం) రాత్రి 8:30 గంటలకు చెన్నెలో బయలుదేరి మర్నాడు ఉదయం 9.10 గంటలకు దువ్వాడ చేరుతుంది.

భువనేశ్వర్‌-కృష్ణరాజపురం- భువనేశ్వర్‌ ప్రత్యేక బై వీక్లీ సువిధ రైలు
82841 సువిధ రైలు. జనవరి రెండు నుంచి ఫ్రిబవరి 27 వరకు (ప్రతి సోమ, గురువారం) 11.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 82842 (ప్రతి మంగళ, శుక్రవారం) జనవరి మూడు నుంచి ఫిబ్రవరి 28 వరకు అందుబాటులో ఉంటుంది. సాయంత్ర 4.05 గంటలకు కృష్ణరాజపురంలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 12.35 గంటలకు విశాఖ చేరుతుంది.

హౌరా, చెన్నై ప్రత్యేక ఏసీ ఎక్స్‌ప్రెస్‌
00841 ప్రత్యేక ఏసీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు. జనవరి ఏడు నుంచి 28 వరకు (ప్రతి శనివారం) మధ్యాహ్నం 12.40 గంటలకు హౌరాలో బయలుదేరి మర్నాడు ఉదయం తెల్లవారు జామున 2.05 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 00842 (ప్రతి ఆదివారం) జనవరి ఎనిమిది నుంచి 29 వరకు సాయంత్రం 5.10 గంటలకు చెన్నైలో బయలుదేరి మర్నాడు ఉదయం 5.15 గంటలకు విశాఖ చేరుతుంది.

కొచ్చివేలి-గౌహతి-కొచ్చివేలి
06336 (ప్రతి ఆదివారం). జనవరి ఒకటి నుంచి మార్చి 31 వరకు (ప్రతి ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు కొచ్చివేలిలో బయలుదేరి మర్నాడు రాత్రి 8.35 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 06335 (ప్రతి బుధవారం) జనవరి నాలుగు నుంచి ఏప్రిల్‌ మూడు వరకు రాత్రి 11.25 గంటలకు గౌహతిలో బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ చేరుతుంది.

హౌరా, ఎర్నాకులం సువిధ ప్రత్యేక రైలు
82801 (ప్రతి శనివారం) సువిధ ప్రత్యేక రైలు. సాయంత్రం 5 గంటలకు హౌరాలో బయలుదేరి మర్నాడు ఉదయం 6.45 గంటలకు విశాఖ చేరుతుంది. జనవరి 28 వరకు అందుబాటులో వుంటుంది. తిరుగు ప్రయాణంలో 82802 (ప్రతి మంగళవారం) ఉదయం 8.50 గంటలకు ఎర్నాకులంలో బయలుదేరి మర్నాడు ఉదయం 8.25 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ రైలు జనవరి (2017) 31 వరకు అందుబాటులో వుంటుంది.

సంబల్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ వయా విశాఖ సువిధ స్పెషల్‌
82831 (ప్రతి బుధవారం) సువిధ ప్రత్యేక వారాంతపు రైలు జనవరి నాలుగు నుంచి 22వ తేదీ వరకు ఉదయం 9.30 గంటలకు సంబల్‌పూర్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 7 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 83852 (ప్రతి శుక్రవారం) జనవరి ఆరు నుంచి 24 వరకు (ప్రతి శుక్రవారం) 00.30 గంటలకు (గురువారం అర్ధరాత్రి 12.30) యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మర్నాడు రాత్రి 8.35 గంటలకు విశాఖ చేరుతుంది.

పుదుచ్చేరి-సంత్రాగచ్చి-పుదుచ్చేరి వయా దువ్వాడ
06010 (ప్రతి శనివారం) జనవరి ఏడు నుంచి మార్చి 25 వరకు రాత్రి 7.15 గంటలకు పుదుచ్చేరిలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 1.43 గంటలకు దువ్వాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 06009 (ప్రతి సోమవారం) జనవరి తొమ్మిది నుంచి మార్చి 27 వరకు మధ్యాహ్నం 2.10 గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి మర్నాడు ఉదయం 3.43 గంటలకు దువ్వాడ చేరుతుంది.

దువ్వాడ మీదుగా సంత్రాగచ్చి, సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక ఏసీ రైలు
ప్రత్యేక చార్జీలు వర్తింపు
02849 (ప్రతి బుధవారం) రాత్రి 11.50 గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి మర్నాడు సాయంత్రం 4.20 గంటలకు దువ్వాడ చేరుతుంది. తిరిగి దువ్వాడలో 4.22 గంటలకు బయలుదేరి మర్నాడు (శుక్రవారం) ఉదయం 4.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. ఈ రైలు ఈనెల 14 నుంచి జనవరి 25 వరకు అందుబాటులో వుంటుంది.
తిరుగు ప్రయాణంలో 02850 (ప్రతి శుక్రవారం) ఉదయం 5.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 7.25 గంటలకు దువ్వాడ చేరుతుంది. తిరిగి దువ్వాడలో 7.27 గంటలకు బయలుదేరి మర్నాడు (శనివారం) ఉదయం 10.25 గంటలకు సంత్రాగచ్చి చేరుతుంది. ఈ రైలు ఈ నెల 16 నుంచి జనవరి 27 వరకు అందుబాటులో వుంటుంది.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS