PHOTO STORIES

HEALTH & FITNESS

దిగివచ్చిన పెట్రో డీలర్లు...కార్డులకు ఓకే...!

దిగివచ్చిన పెట్రో డీలర్లు...కార్డులకు ఓకే...!

పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ అమ్మకాలకు క్రెడిట్ డెబిట్ కార్డులు అంగీకరించేది లేదని చెప్పిన పెట్రో డీలర్లు చల్లబడ్డారు. జనవరి 13 లోపు ఈ సమస్యను పరిష్కరిస్తామని పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమకు హామీ ఇచ్చారని పెట్రో డీలర్లు చెప్పారు. అందుకే స్ట్రైక్ నిర్ణయాన్ని 13 కు వాయిదా వేస్తున్నామన్నారు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కార్డులతో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై MDRను రద్దు చేసింది ప్రభుత్వం. అయితే 50 రోజుల గడువు ముగియడంతో MDR వసూలు చేస్తామని స్టేట్ బ్యాంక్, HDFC, యాక్సిస్ బ్యాంక్ లు పెట్రో డీలర్లకు సమాచారం ఇచ్చాయి.

జనవరి 9 నుంచి క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లపై 1 శాతం, డెబిట్ కార్డులతో కొనుగోళ్లపై 0.25 నుంచి 1శాతం వరకు కమీషన్ వసూలు చేస్తామని డీలర్లకు తెలిపాయి.
దీంతో ఆదివారం అర్థరాత్రి నుంచి కార్డులతో అమ్మకాలు నిలిపివేస్తామని డీలర్లు ప్రకటించారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ బ్యాంకులు, పెట్రో డీలర్లతో అత్యవసరంగా చర్చలు జరిపింది. కార్డులపై కమీషన్ వసూలును.. నాలుగైదు రోజుల పాటు వాయిదా వేసేందుకు బ్యాంకులు అంగీకరించాయి.
ICICI బ్యాంక్ మాత్రం తామెలాంటి చార్జీలు వసూలు చేయడంలేదని తెలిపింది. 13 వరకు కార్డులతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు సాధారణంగానే కొనసాగనున్నాయి.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS