Wednesday, 20 September 2017 | Login

PHOTO STORIES

HEALTH & FITNESS

షాక్...ఆర్ బి ఐ గవర్నర్ కు సమన్లు...!

షాక్...ఆర్ బి ఐ గవర్నర్ కు సమన్లు...!

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఆర్ బి ఐ గవర్నర్ కు సమన్లు జారీ చేసింది పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ(పి ఎ సి). నోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐ పాత్ర, నల్లధనం వసూళ్లు, విత్ డ్రాయల్ పరిమితిపై ఆంక్షలు వంటి పలు అంశాలపై ప్రశ్నలు సంధించింది పీఏసీ. సరైన ఆధారాలు చూపించకుంటే.. అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టే అవుతుందని వ్యాఖ్యానించింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తోపాటు ఆర్థిక, రెవెన్యూ శాఖల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించామని వెల్లడించారు పీఏసీ చైర్మన్ కేవీ థామస్.
పీఏసీ సంధించిన ప్రశ్నలివే..

…నోట్ల రద్దు నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నదా లేక ఆర్బీఐ తీసుకుందా?

… రద్దు నిర్ణయం ఆర్బీఐ తీసుకుంటే..ఎప్పుడు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారో తెలపాలి?

… రాత్రికి రాత్రి నోట్లను రద్దు చేయడం వెనక ఉన్న అసలు కారణాలేంటి?

… ఇతర దేశాల(జపాన్ 18, స్విట్జర్లాండ్ 13) జీడీపీలో అధికశాతం నోట్లు ఉండగా.. భారత్( జీడీపీలో 12 శాతం)లోనే నోట్లను రద్దు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? (చైనాలో 96 శాతం ఆ దేశ కరెన్సీ చెలామణిలో ఉండగా.. భారత్ లో 86 శాతం, అమెరికాలో 81 శాతం ఉన్నాయి)

… నవంబర్ 8న జరిగిన అత్యవసర ఆర్బీఐ బోర్డు సమావేశం మీటింగ్ మినిట్స్(చర్చించిన అంశాలు) ఏంటి?

… కేబినెట్ ఆమోదం కోసం పంపిన లేఖలో 86 శాతం నోట్ల రద్దు విలువ ఎంతో పేర్కోన్నారా? అంతే విలువగల కరెన్సీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎంత సమయం పడుతుందో చర్చించారా?

… ఆర్బీఐలోని ఏ చట్టం ప్రకారం విత్ డ్రా పరిమితిపై ఆంక్షలు విధించారు? ఆర్బీఐకి ఈ అధికారం ఉందా? అలాంటి చట్టాలేమి లేకపోతే..అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకుగాను ఆర్బీఐ పదవుల నుంచి అధికారులను ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలి?

… ప్రజల విత్ డ్రాయల్ పరిమితి సలహా ఇచ్చిన అధికారి ఎవరు? వివాహ సంబంధ విత్ డ్రాయల్స్ నిబంధనలను రాసిందెవరు? ఒక వేళ ప్రభుత్వమే ఈ నిబంధనలు విధిస్తే..ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగంగా ఆర్బీఐ పనిచేస్తుందనుకోవాలా?

… రద్దయిన నోట్ల అసలు విలువ ఎంత? బ్యాంకుల్లో డిపాజిటైన పాత నోట్ల విలువ ఎంత? నవంబర్ 8న ఎంత శాతం నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు?

… నోట్ల రద్దుపై వివరాలు ఇవ్వడానికి ఆర్బీఐ..ఆర్టీఐ పిటీషన్లను ఎందుకు తిరస్కరించింది?

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS