PHOTO STORIES

HEALTH & FITNESS

ఇవి రోజుకు 50 గ్రాములు తింటే చాలు..క్యాన్సర్ హార్ట్ అటాక్ లు మన దరి చేరవు...!

ఇవి రోజుకు 50 గ్రాములు తింటే చాలు..క్యాన్సర్ హార్ట్ అటాక్ లు మన దరి చేరవు...!

వీటిని నిత్యం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి. శ‌రీరానికి కావల్సిన కీల‌క పోషకాలైన విట‌మిన్స్‌, మిన‌రల్స్ అందుతాయి. అయితే న‌ట్స్ విష‌యంలో చాలా మందికి తలెత్తే ప్ర‌శ్న ఒక్క‌టే. అది… రోజుకు ఎన్ని న‌ట్స్ తినాల‌న్న‌దే..! ఎంత మొత్తంలో న‌ట్స్ తింటే శ‌రీరానికి మేలు జ‌రుగుతుందో చాలా మందికి తెలియ‌దు. నిత్యం మ‌నం ఏ ర‌కం న‌ట్స్ అయినా 10 గ్రాముల మోతాదులో తింటే చాల‌ట‌. దీంతో మ‌న‌కు ఆ రోజుకు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయ‌ట‌. అయితే ఏదైనా ఒకే ర‌కం న‌ట్స్‌ను కాకుండా 3, 4 ర‌కాల న‌ట్స్‌ను 10 గ్రాముల మోతాదులో తింటే శరీర ఆరోగ్యం సూపర్ గా ఉంటుందట. ఏయే నట్స్ తో శరీరానికి అందే పోషకాలేమిటో కింద చూద్దాం..
వాల్‌న‌ట్స్‌:
10 గ్రాముల వాల్ నట్స్ అంటే 5, 6 తింటే సరిపోతుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ త‌యార‌వుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రావు. ఎముక‌లు దృఢత్వం పొందుతాయి. శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. డ‌యాబెటిస్ ఉంటే అదుపులోకి వ‌స్తుంది. క్యాన్స‌ర్లు రావు. మ‌గ‌వారిలో అయితే వీర్యం బాగా వృద్ధి చెందుతుంది. ఆడ‌వారిలో రుతు స‌మ‌స్య‌లు పోతాయి.

బాదం ప‌ప్పు:
రోజూ 8, 9 తింటే 10 గ్రాములకు సమానం. వీటి వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్షన్లు న‌య‌మ‌వుతాయి. సంతానం క‌లిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. డ‌యాబెటిక్స్‌కు ఇది మంచిది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె స‌మ‌స్య‌లు రావు. చెడు కొలెస్ట్రాల్ పోయి, మంచి కొలెస్ట్రాల్ ఉత్ప‌న్నం అవుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మంచి ఆహారం.
వేరుశెన‌గ‌లు:
వంటకాల్లో కాకుండా వేరుశెన‌గ‌ల‌ను న‌ట్స్ రూపంలోనూ రోజూ తీసుకోవచ్చు. 10 గ్రాముల మోతాదులో తినాలంటే వీటిని క‌నీసం 10 నుంచి 15 వ‌ర‌కు తినాలి. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి, మంచి కొలెస్ట్రాల్ త‌యార‌వుతుంది. ప్లాంట్ ఆధారిత ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి శ‌రీరానికి ఎంత‌గానో అవ‌స‌రం. క్యాన్స‌ర్లు, గుండె జ‌బ్బులు రావు. విట‌మిన్ ఇ ఉండ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది.
పిస్తా ప‌ప్పు:
వీటిని నిత్యం 8,9 తింటే 10 గ్రాములు తిన్నట్టే. పిస్తా పప్పు వ‌ల్ల గుండె సమ‌స్య‌లు రావు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మేలు చేస్తుంది. పొడి చ‌ర్మం ఉన్న‌వారు తింటే వారి చ‌ర్మం మృదువుగా మారుతుంది. పీచు ఉండ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ఠ‌మ‌వుతుంది. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది.
జీడిప‌ప్పు:
జీడిప‌ప్పును రోజుకు 6,7 తిన్నా 10 గ్రాముల మోతాదుకు సుల‌భంగా చేరుకోవ‌చ్చు. దీని వ‌ల్ల గుండె సంబంధ వ్యాధులు రావు. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్త‌హీన‌త పోతుంది. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. కంటి స‌మ‌స్య‌లు రావు. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS