PHOTO STORIES

HEALTH & FITNESS

ఇదేంటి..ఇలా చేసారు..'ఖైది' పై మురుగదాస్ షాకింగ్ కామెంట్స్...!

ఇదేంటి..ఇలా చేసారు..'ఖైది' పై మురుగదాస్ షాకింగ్ కామెంట్స్...!

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 వ సినిమా ఖైది నంబర్ 150 ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళం లో సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా ఈ సినిమా నిర్మితమైంది. కత్తి సినిమాకు దర్శకుడు మురుగదాస్. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తోపాటు మెస్సేజ్ కూడా క‌లిసి ఉండటం ఈ సినిమాకి బాగా క‌లిసి వ‌చ్చింది. చిరు ఖైదీ 150 ని మురుగ‌దాస్ ఇవాళ హైద‌రాబాద్‌లో చూశారు. ఈ మూవీ చూసి ఆయ‌న కాస్త ఇబ్బందిగా ఫీల‌య్యార‌ట‌.
ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో ఓ కామెడీ ట్రాక్ ఉంటుంది. అది ఆయ‌నను ఫీల‌య్యేలా చేసింద‌ట‌. ఇంత‌కీ మేటర్ ఏంటంటే.. మురుగదాస్‌కి లిక్క‌ర్ అంటే గిట్ట‌దు. దాదాపు ఆయ‌న డైర‌క్ట్ చేసే సినిమాల‌లో అలాంటి సీన్స్‌లో లేకుండా చూసుకుంటాడ‌ట మురుగ‌దాస్‌.

త‌మిళ్ క‌త్తి మూవీలోనూ విల‌న్ గ్రీన్ టీ తాగుతున్న‌ట్లు చూపించాడు మురుగదాస్‌. కానీ, ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో ఏకంగా ఓ కామెడీ ట్రాక్ మొత్తం లిక్క‌ర్ సెంట‌ర్‌గానే న‌డ‌వ‌డం ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టింద‌ట‌. ఈ సీన్ హీరోకి, క‌మెడియ‌న్‌కి మ‌ధ్య సాగుతుంది. దీనిని చూసిన మురుగ‌దాస్‌.. ఇదేంటి.. ఇలా చేశారు..? అని త‌న చుట్టుప‌క్క‌న ఉన్న వారితో త‌న అభిప్రాయం షేర్ చేసుకున్న‌ట్టు స‌మాచారం.
ఇటు, ఆలీకి లేడీ గెట‌ప్ వేసిన సీన్‌పైనా ఆయ‌న త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశాడ‌ట‌. మ‌రో యాంగిల్‌లో ఆలోచిస్తే బావుండేది క‌దా….? అని అన్న‌ట్లు తెలుస్తోంది. కానీ, ప‌క్కా క్లాసీగా సినిమాలు చేసే మురుగ‌దాస్‌కి మ‌న జ‌నాల మాస్ టేస్ట్ అలాగే ఉంటుంది మ‌రి అని కామెంట్స్ వేస్తున్నార‌ట చాలా మంది.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS