PHOTO STORIES

HEALTH & FITNESS

అభిమానం హద్దులు దాటింది.. ప్రాణాల మీదకొచ్చింది

అభిమానం హద్దులు దాటింది.. ప్రాణాల మీదకొచ్చింది
మెగాస్టార్‌ 9 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఖైదీ నెం.150’ చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. అంతా సాఫీగా ఉందని, ఆనందంగా మెగా క్యాంప్‌ ఉన్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది. కొన్ని చోట్ల టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారు అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆందోళనలు చేస్తుంటే మరి కొన్ని చోట్ల అభిమానులు కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేశారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇక వైజాగ్‌లో ఒక అభిమాని టికెట్‌ దొరకలేదు అని బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు.


వైజాగ్‌కు చెందిన ఒక మెగా అభిమాని టికెట్‌ కోసం చివరి వరకు ప్రయత్నం చేశాడు. బ్లాక్‌లో అయినా కొనుగోలు చేయాలని భావించాడు. కాని బ్లాక్‌లో కూడా దొరకక పోవడంతో నిరుత్సాహంతో బ్లేడ్‌తో తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే పక్కన ఉన్నవారు ఆ అభిమానిని హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడు వైజాగ్‌లోని ఒక హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. మరికొన్ని చోట్ల కూడా టికెట్ల కోసం కుస్తీ పట్టు తప్పలేదు. మొత్తానికి మెగా ఫ్యాన్స్‌ ఖైదీ ఫ్యాన్స్‌ కోసం ఎదురు చూసినందుకు మంచి ఫలితమే దక్కింది. 

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS