PHOTO STORIES

HEALTH & FITNESS

టెన్షన్‌లో నందమూరి క్యాంప్‌

టెన్షన్‌లో నందమూరి క్యాంప్‌
దాదాపు మూడు నెలుగా మెగా నందమూరి ఫ్యాన్స్‌ మద్య ప్రచ్చన్న యుద్దం జరుగుతుంది. గత పది రోజులుగా ఆ యుద్దం మరింత ఎక్కువ అయ్యింది. సంక్రాంతికి చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి మరియు నందమూరి హీరో బాలకృష్ణలు తమ తమ సినిమాలతో ఢీ కొట్టబోతున్నందున వాతావరణం అంతా కూడా చాలా వేడెక్కింది. టాలీవుడ్‌లో ఎవరు ఎవరి వైపు మాట్లాడితే ఏం వస్తుందో అని అంతా స్థబ్దతగా ఉన్నారు. ఇక తాజాగా చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఖైదీ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది.


ఖైదీ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ మరియు రివ్యూలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నందమూరి క్యాంప్‌లో టెన్షన్‌ వాతావరణం మొదలైంది. బాలకృష్ణ తన 100వ సినిమా అయిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నందమూరి ఫ్యాన్స్‌ కూడా ఖైదీని ఎన్నో రకాలుగా విమర్శించి తమ శాతకర్ణి గొప్ప అంటూ పొగడ్తలు గుప్పించారు. ఖైదీ సినిమా కంటే ఒక్కింత ఎక్కువగా శాతకర్ణి సినిమాపైనే ఉన్నాయి. ఛారిత్రాత్మక నేపథ్యం గల సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఖైదీ సక్సెస్‌ అయిన నేపథ్యంలో శాతకర్ణికి డివైడ్‌ టాక్‌ వస్తే కనీసం కలెక్షన్స్‌ కూడా రావు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శతమానం భవతి కూడా విడుదలకు సిద్దంగా ఉంది. దాంతో క్రిష్‌ అండ్‌ టీం కాస్త కంగారులో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కొన్ని గంటల్లో ఆ విషయం కూడా తేలిపోనుంది. 

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS