PHOTO STORIES

HEALTH & FITNESS

చిరు కూడా కాపాడలేక పోయాడు

చిరు కూడా కాపాడలేక పోయాడు
టాలీవుడ్‌ హాస్యబ్రహ్మ బ్రహ్మానందంకు గత కొంత కాలంగా టైం బ్యాడ్‌ నడుస్తుంది. ఈయన ఏ సినిమాు చేసినా కూడా పెద్దగా సక్సెస్‌ అవ్వడం లేదు. తాజాగా ఈయన ఖైదీ నెం.150 చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా సక్సెస్‌ అయ్యింది కాని బ్రహ్మానందం పాత్రకు మంచి మార్కులు పడలేదు. ఎప్పటి మాదిరిగానే ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం సాదాసీదా కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసి సఫలం కాలేదు. చిరంజీవి రీ ఎంట్రీతో బ్రహ్మానందం కూడా మళ్లీ పుంజుకోవడం ఖాయం అని అంతా భావించారు. కాని అలా జరగడం కష్టంగానే ఉంది.


మెగాస్టార్‌ సినిమాల్లో గతంలో బ్రహ్మానందం చాలా పాత్రలు పోషించి ఆకట్టుకున్నాడు. కాని ఈసారి మాత్రం సినిమాకు బ్రహ్మానందం మైనస్‌ అయ్యాడు. అన్ని బాగున్న ఖైదీలో ఎంటర్‌టైన్‌మెంట్‌ జొప్పించి చెడగొట్టారు అనే టాక్‌ వస్తుంది. బ్రహ్మానందంతో మూస కామెడీ చేయించి ఆకట్టుకోలేక పోయారు. అందరు దర్శకుల మాదిరిగానే బ్రహ్మీతో కామెడీ చేయించి నవ్వించాలని దర్శకుడు భావించాడు. అయితే అది వర్కౌట్‌ కాలేదు. ఖైదీ తర్వాత అయినా బ్రహ్మానందం ఇక కామ్‌గా రిటైర్‌ అయితే బాగుంటుందని ఆయన అభిమానులే స్వయంగా అంటున్నారు. బ్రహ్మానందం ఇంకా చెత్త మూస కామెడీ చేసి ఫ్లాప్‌లతో సినిమాలు చేయకుండా ఉండటం కంటే ఇకపై సినిమాలు ఒప్పుకోకుంటేనే మంచిది అని కొందరు భావిస్తున్నారు. 

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS