PHOTO STORIES

HEALTH & FITNESS

వావ్‌.. ఇది చిరంజీవి స్టామినా

వావ్‌.. ఇది చిరంజీవి స్టామినా
మెగాస్టార్‌ చిరంజీవి 9 సంవత్సరాల తర్వాత ‘ఖైదీ నెం.150’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. భారీ స్థాయిలో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు మరియు మెగా ఫ్యాన్స్‌ నీరాజనాలు పడుతున్నారు. ఈ సినిమాలో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గిందనే టాక్‌ తప్ప అంతా బాగుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్‌తో దుమ్ము రేపుతుంది. మొదటి రోజు కలెక్షన్స్‌లో టాప్‌ చిత్రాల జాబితాలో చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక యూఎస్‌లో ఈ సినిమా సంచలన కలెక్షన్స్‌ను నమోదు చేసింది.


మెగాస్టార్‌కు ఉన్న మెగా క్రేజ్‌తో ఈ సినిమాను ప్రీమియర్‌ షో చూడాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులతో పాటు అమెరికాలో ఉన్న ప్రేక్షకులు కూడా భావించారు. భారీ క్రేజ్‌ ఉన్న నేపథ్యంలో అత్యధిక స్క్రీన్స్‌లలో ఈ సినిమాను ప్రదర్శించారు. భారీగా ప్రీమియర్‌ షోలు వేయడంతో పాటు మంచి రెస్పాన్స్‌ రావడంతో ఏకంగా మిలియన్‌ డాలర్లను ఈ చిత్రం వసూళ్లు చేసింది. కేవలం ప్రీమియర్‌ షోలకు మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేయడం సౌత్‌ సినిమాకు ఇదే ప్రథమం. ఇక లాంగ్‌ రన్‌లో కూడా ఈ సినిమా కనీసం మూడు మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసి తీరుతుందనే నమ్మకంతో ట్రేడ్‌ వర్గాల వారు ఉన్నారు. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఓపెనింగ్స్‌ను ఈ సినిమా రాబట్టింది. ఓపెనింగ్స్‌తో చిరంజీవి తన స్టామినాను నిరూపించుకున్నాడు. 

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS