PHOTO STORIES

HEALTH & FITNESS

'ఖైది నంబర్ 150' లో అదే పెద్ద మైనస్...!

'ఖైది నంబర్ 150' లో అదే పెద్ద మైనస్...!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైది నంబర్ 150' ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 4500 దియేటర్లలో భారీ ఎత్తున విడుదలయింది. ఖైదీ నెం.150 ఒకరోజు ముందే యూఎస్‌లో విడుదలైంది. టాక్ కూడా తెలిసిపోయింది. సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో బాస్ ఈజ్ బ్యాక్ అని అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఖైది డ్యాన్సుల్లో చిరంజీవి మార్క్ కనిపించిందని అంటున్నారు.
ఓ పాటలో తనయుడు రామ్‌చరణ్ కూడా తళుక్కున మెరుస్తాడు. సినిమాలో అన్నీ బాగున్నా ఒక్క‌టే మైన‌స్‌గా మారింది. ప్రేక్ష‌కుల‌కు బాగా కావాల్సిన కామెడీ పండలేదని చెబుతున్నారు. ఆలీ, బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్లు నటించినా అలరించలేక పోయారట. సందర్భం లేకుండా వచ్చే కామెడీ సీన్స్ విసుగు తెప్పించాయి.

ఇక కాజ‌ల్‌-చిరు మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్లు కూడా ఆస‌క్తిగా లేవు. ఓవ‌రాల్‌గా వినాయక్ ఈ సినిమాను నడిపించిన తీరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక క‌మెడియ‌న్స్‌ను అంద‌రిని సినిమాలో ఇన్వాల్ చేసినా ఆ కామెడీయే సినిమా ప్లోకు మైన‌స్ అయ్యింది. బ్ర‌హ్మీ కామెడీ ప్లాప్ అవ్వ‌గా, పోసాని కాస్త‌లో కాస్త బెట‌ర్‌. 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వి సీన్లు చాలా వ‌ర‌కు క‌ట్ అయిపోయాయి. ఓవ‌రాల్‌గా సినిమాకు హిట్ టాక్ వ‌చ్చినా కామెడీని డీల్ చేయ‌డంలో వినాయ‌క్ ప్లాప్ అయిన‌ట్టే టాక్ వ‌స్తోంది.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS