PHOTO STORIES

HEALTH & FITNESS

ప్రీమియర్ షోలతోనే 'బాహుబలి' రికార్డులు బ్రేక్ చేసిన 'ఖైది నంబర్ 150'...!

ప్రీమియర్ షోలతోనే 'బాహుబలి' రికార్డులు బ్రేక్ చేసిన 'ఖైది నంబర్ 150'...!

పది సంవత్సరాల తరువాత తెలుగు తెరకు దూరమైన చిరు ఖైది నంబర్ 150 తో దుమ్ము రేపుతున్నాడు. అమెరికాలో దాదాపు 200పైగా థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా లక్ష మిలియన్ డాలర్లకు పైగానే (6కోట్ల 82లక్షల 45వేల రూపాయలకు పైగా)  వసూలు చేసింది. ఇప్పటివరకూ ప్రీమియర్ షోల ద్వారా లక్ష మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన తెలుగు సినిమా ఒక్క బాహుబలి మాత్రమే. అమెరికాలో రికార్డు స్థాయిలో థియేటర్లలో సినిమాను విడుదల చేసినా.. వేలాది మంది ప్రేక్షకులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారనీ, ప్రీమియర్ షోలకు టికెట్ బుకింగ్ అయిపోయిందనీ అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ట్వీట్ చేశారు.

మరికొన్ని థియేటర్లను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి ప్రీమియర్ షోలకు టికెట్స్ ఇవ్వడం ప్రారంభించామనీ అయితే గంటల్లోనే హాటు కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోయాయని తెలిపారు. అమెరికాలో రికార్డులన్నీ ఖైదీ నెంబర్ 150 సినిమా తిరగరాయడం ఖాయమని వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమాలో చిరు ఇరగదీశారని చెబుతున్నారు. ముఖ్యంగా డాన్స్, ఫైట్స్, డైలాగ్స్‌ అద్భుతంగా ఉన్నాయని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS