PHOTO STORIES

HEALTH & FITNESS

ఆడనారిమని చేతి లో...చిక్కుకున్న సి.ఎం చంద్రబాబు...!

ఆడనారిమని చేతి లో...చిక్కుకున్న సి.ఎం చంద్రబాబు...!

తెలుగు ప్రజలు గొప్పగా చెప్పుకునే వ్యక్తి, మనోడు అని గర్వించే వ్యక్తి గౌతమిపుత్రుడు శాతకర్ణి. ఈయన జీవిత కథతో క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఆ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాకున్న చారిత్రాత్మక నేపథ్యం దృష్ట్య తెలుగు రాష్ట్రాల్లో పన్ను రాయితీ దక్కింది. మొదట కేసీఆర్‌ పన్ను రాయితీని ప్రకటించిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా శాతకర్ణి చిత్రానికి పన్ను రాయితీ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.



ఈ సమయంలోనే అనుష్కతో రుద్రమదేవి చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్‌ తెరపైకి వచ్చాడు. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రుద్రమదేవి చిత్రం కూడా ఒక తెలుగు వీర నారి జీవిత చరిత్ర గురించి అంటూ ఏపీలో పన్ను రాయితీ కోరాను. కాని ఏవో కారణాల వల్ల తన సినిమాకు పన్ను రాయితీ ఇవ్వలేదు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మంచి మనస్సుతో మాకు పన్ను రాయితీ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు శాతకర్ణి చిత్రానికి పన్ను రాయితీ ఇవ్వడం సంతోషంగా ఉంది.
అలాగే మా సినిమాకు కూడా పన్ను రాయితీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడైనా కూడా తమ వద్ద నుండి వసూళ్లు చేసిన పన్నును రిఫండ్‌ చేయాల్సిందిగా గుణశేఖర్‌ కోరాడు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమయం చూసి సీఎం చంద్రబాబును గుణశేఖర్‌ ఇరికించేశాడు. 

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS