ఈ చిన్న ట్రిక్ తో మీకు ఎన్ని తత్కాల్ టికెట్లు కావాలన్నా చేసుకోవచ్చు..

849

ట్రైన్ రిజర్వేషన్ టికెట్ కోసం ఎన్ని క‌ష్టాలు పడాల్సి వస్తుందో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి దేవుడు కూడా కనిపిస్తాడు. ఇక అనుకోకుండా ప్రయాణం వచ్చి, వెంటనే స‌డెన్ గా ట్రైన్ టికట్ కావాలంటే. తత్కాల్ అంద‌రికి గుర్తుకొస్తుంది. కానీ తత్కాల్‌లో ఒక్క టికెట్‌ బుక్‌ చేయాలంటేనే తలప్రాణం తోకలోకొస్తుంది.. ఒక ఐపీ అడ్రసు నుంచి 2 టికెట్లకు మించి కొనడానికి వీలు కాదు.. ఇక నెలకు 6 టికెట్లు మాత్ర‌మే కొన‌డానికి సాధ్య‌మ‌వుతుంది.

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

అయితే ఐఆర్‌సీటీసీ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను, లొసుగులను గమనించిన రైల్వే మాజీ ఉద్యోగి, ప్రస్తుత సీబీఐ ఉద్యోగి అజయ్ గార్గ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని వందల టికెట్లు బుక్‌ చేసుకునేలా నకిలీ ఐఆర్‌సీటీసీ సాఫ్ట్‌వేర్‌ రూపొందించాడు. దాని ద్వారా త‌త్కాల్ టికెట్ల‌రు కొల్లగొట్టి ఇండియ‌న్ రైల్వేస్ కే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.2012లో సీబీఐ అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌గా చేరిన విజయ్‌ గార్గ్‌ 2007-11 మధ్య నాలుగు సంవత్సరాల పాటు ఐఆర్‌సీటీసీలో పనిచేశాడు.

Image result for tatkal tickets

ఈ స‌మ‌యంలోనే రైల్వే టికెటింగ్ సిస్టంలోని లోపాలను బాగా గమనించిన ఆయ‌న‌, కొత్త సాఫ్ట్‌వేర్‌ను సృష్టించాడు. ఈ సాఫ్ట్‌వేర్‌ను తన అనుచరుడు అనిల్‌ గుప్తా ద్వారా కొంతమంది ఏజెంట్లకు విక్రయించాడు. దీంతో ఒక్కో ఏజెంట్‌ ద్వారా ఒకేసారి వందల తత్కాల్‌ టికెట్లను బుక్‌ చేస్తూ.. తద్వారా నిజమైన ప్రయాణీకులను ఇబ్బందుల పాలు చేశాడు. బుకింగ్‌ ఏజెంట్ల ద్వారా భారీ సంపదను కూడగట్టాల‌నే వ‌క్ర‌బుద్దిని అల‌వ‌ర్చుకున్నాడు. ముఖ్యంగా బిట్‌కాయిన్స్‌, హవాలా నెట్‌వర్క్‌ ద్వారా టికెట్ల ద్వారా వ‌చ్చే డ‌బ్బును అందుకునేవాడు. అయితే సిబీఐ అధికారుల దాడుల్లో ఇత‌ని భాగోతం బ‌య‌ట‌ప‌డిపోయింది.

Related image
రైల్వే తత్కాల్‌ టికెట్ల స్కాం కేసులో ఓ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌ని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఒకేసారి వందల టికెట్లు బుక్‌ చేసే అక్రమ సాఫ్ట్‌వేర్‌ రూపొందించిన ఆరోపణలపై సీబీఐ అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌సహా, మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసింది.అక్రమ సాఫ్ట్‌వేర్‌ సాయంతో రైల్వే తత్కాల్ రిజర్వేషన్ల వ్యవస్థ లో అక్రమాలకు పాల్పడిన ప్రోగ్రామర్ అజయ్‌ గార్గ్‌ను బుధవారం అరెస్టు చేసింది.

Image result for tatkal tickets

వీరినుంచి భారీ ఎత్తున నగలు,నగదును స్వాధీనం చేసుకుంది. వీరి నుంచి రూ. 89 లక్షల నగదును, రూ.69 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రెండు బంగారు పట్టీలు, 15 ల్యాప్‌ట్యాప్‌లు, 15 హార్డ్ డిస్క్‌లు, 52 మొబైల్ ఫోన్లు, 24 సిమ్ కార్డులు, 10 నోట్‌బుక్స్‌, ఆరు రౌటర్లు, నాలుగు డోంగ్లెస్, 19 పెన్ డ్రైవ్స్‌ తదితరాలను స్వాధీనం చేసుకుంది సీబీఐ. గార్గ్‌తోపాటు అతని సన్నిహితుడు అనిల్ గుప్తాను కూడా అరెస్టు చేసిన సీబీఐ, పోలీస్ కేసు నమోదు చేసింది.

Image result for tatkal tickets

ఏదైనా ఊరు వెళ్లాలనుకునే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తత్కాల్‌ టికెట్ల కోసం ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో అజయ్‌గార్గ్‌ వద్ద సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేసిన ట్రావెల్‌ ఏజెంట్లు ఫేక్‌ ఐడీలతో, ఫేక్‌ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఒకే దెబ్బకు 800 నుంచి 1000 దాకా టికెట్లను బుక్‌చేస్తారు. కన్‌ఫర్మ్‌ టికెట్లు బుక్‌ చేసినందుకుగాను ప్రయాణికుల నుంచి ఒక్కో టికెట్‌కు డిమాండ్‌ను బట్టి రూ.500 నుంచి రూ.5000 దాకా వసూలు చేస్తారు.