మీ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డులు డిసెంబ‌ర్ 31 త‌ర్వాత ప‌నిచేయ‌వు కార‌ణం తెలుసుకోండి

12198

ఆర్.బీ.ఐ. టెక్నాల‌జీ డ‌వ‌ల‌ప్ అయ్యేకొల‌ది సైబ‌ర్ నేరాలు అదుపులో ఉంచేందుకు మ‌రిన్ని క‌ఠిన నిర్ణ‌యాలు సేఫ్ వ‌ర్క్స్ చేస్తోంది.. ఇందులో భాగంగా ఆన్ లైన్ మోసాలు జ‌రుగ‌కుండా బ్యాంకులు కూడా చాలా గ‌ట్టి వెబ్ సిస్టం మెయింటైన్ చేయాల‌ని చెబుతోంది.. బ్యాంకింగ్ అధారిటీల‌తో పాటు ఆర్బీఐ ప్ర‌భుత్వ ప్రైవైటే బ్యాంకుల‌కు టెక్నాల‌జీ విష‌యంలో ఖాతాదారుల సొమ్ము విష‌యంలో చాలా జాగ్ర‌త్త వ‌హించాల‌ని చెబుతోంది.
తాజాగా ఆర్.బి.ఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏటీఎం లావాదేవీలను మరింత సురిక్షతం చేసేందుకు ఎస్‌బీఐ మరో ముందుడుగు వేసింది.

ప్రస్తుతం వాడుకలో ఉన్న మ్యాగ్‌స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులను ఈ ఏడాది చివరినాటికి రద్దు చేస్తున్నట్లు తెలిపింది… అంటే.. డిసెంబరు 31 తర్వాత చిప్‌ లేని, మ్యాగ్‌స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులు పనిచేయవవు… ఈ మేరకు ఎస్‌బీఐ ఒక ప్రకటన చేసింది. మ్యాగ్‌స్ట్రిప్‌ డెబిట్‌ కార్డుల స్థానంలో కొత్త ఈఎంవీ చిప్‌ కార్డులను బ్యాంకు జారీ చేయనున్నది. ఈ కార్డుల కోసం డిసెంబరు 31లోగా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని లేదా సంబంధిత బ్రాంచిలో సంప్రదించాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు..

Image result for sbi card
చిప్‌ లేని, మ్యాగ్‌స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులు ఇక ప‌నిచేయ‌వు అని తెలియ‌డంతో ఖాతాదారులు ఇప్ప‌టికే బ్యాంకుల‌కు వెళ్లి కొత్త కార్డుల కోసం అప్లై చేస్తున్నారు.. ఈ కొత్త మ్యాగ్ స్ట్రిప్ కార్డులు చాలా ప్రైవ‌సీ కార్డులు అని ఆన్ లైన్ మోసాలు అరిక‌ట్ట‌డంలో ఈ కార్డుల‌ను వాడితే మోసాలు త‌గ్గుతాయ‌ని చెబుతున్నారు… హ్యాక‌ర్లు, లేదా ఏటీఎమ్ లో కార్డు బ‌ద‌లాయింపులు చేసేవారిని ఈజీగా ఈ కార్డుల ద్వారా మోసం చేస్తే గుర్తుప‌ట్ట‌నున్నారు.. ఇక మ‌రో నాలుగు నెలల్లో కొత్త ఏటిఎం కార్డులు ఎస్బీఐ ఇవ్వ‌నుంది.. ఇక నాలుగు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టంతో కొత్త కార్డుల కోసం ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్ అలాగే బ్యాంకు బ్రాంచీల‌లో అత్య‌ధికంగా అప్లికేష‌న్లు పెరుగుతున్నాయి.. ఇక ఆల‌స్యం ఎందుకు మీరు కూడా ఈ మ్యాగ్ స్ట్రిప్ కార్డు కోసం అప్లై చేయండి… ఈ విలువైన స‌మాచారాన్ని మీ మిత్రుల‌కు తెలియ‌చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో వెల్ల‌డించండి.