థాయ్ ల్యాండ్ గురించి షాకింగ్ నిజాలు

821

ఒక్కో దేశంలో ఒక్కో నియ‌మాలుంటాయి . కొన్ని దేశాల్లో క‌ఠిన‌మైనవుంటే మ‌రికొన్ని దేశాల్లో న‌వ్వును తెప్పించేవిగా ఉంటాయి. మ‌రికొన్ని దేశాల్లో గౌర‌వాన్ని పెంచేవిగా ఉంటాయి. ఒక్కో దేశానికి మ‌ధ్య సంస్కృతి, సాంప్ర‌దాయాలు విషయంలో కూడా అనేక తేడాలు ఉంటాయి.

ఈ క్రింది వీడియో చూడండి.

అలాగే చ‌ట్టాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఒక్క దేశ చ‌ట్టాలు, మ‌రో దేశ చ‌ట్టాల మ‌ధ్య ఎంతో తేడా ఉంటుంది. అలాగే ఆహారం, అల‌వాట్లు విష‌యంలో కూడా అస‌లు పొంత‌న ఉండ‌దు. కొన్ని దేశాల్లో చిన్న చిన్న త‌ప్పుల‌కే క‌ఠిన త‌ర‌మైన శిక్ష‌లు విధిస్తారు. కొన్ని దేశాల్లో కొన్ని ప‌నులు చేయ‌కూడ‌దు. అవి చేస్తే క‌ఠిన శిక్ష‌లు త‌ప్ప‌వు. ఇలా ఒక‌దేశానికి, మ‌రో దేశానికి మ‌ధ్య చాలా తేడాలు క‌నిపిస్తాయి. విదేశాల‌కు వెళ్లే వారు కూడా అక్క‌డ చ‌ట్టాల‌ను గౌర‌వించాల్సి ఉంటుంది.

Image result for thailand
కానీ థాయిలాండ్ లో ఉన్న 7 నియ‌మాల‌ను చూస్తే మూడు అంశాలు మిక్స్ చేసిన‌ట్టు అనిపిస్తాయి.. అక్క‌డి కొన్ని నియ‌మాలు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయి. థాయిలాండ్ లో ఆశ్చ‌ర్యాన్ని గొలిపే ఆ 7 నియ‌మాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నియామాల‌ను వింటే కొన్ని న‌వ్వు తెప్పిస్తాయి. థాయ్ లాండ్ లో అండ‌ర్ వేర్ లేకుండా బ‌య‌ట తిర‌గ‌డం నేరం. అండ‌ర్ వేర్ లేకుండా తిరిగితే అరెస్ట్ చేస్తారు. థాయ్ వారికి ట్రాన్స్ జెండ‌ర్ వారి మీద అపారమైన గౌరవం ఉంటుంది.

Related image

అంద‌కే మేల్ ఫీమేల్ తో పాటు థ‌ర్డ్ జెండ‌ర్ వారికి కూడా సెప‌రేట్ వాష్ రూమ్స్ ఉంటాయి థాయ్ లాండ్ లో . ట్రాన్స్ జెండ‌ర్ వారికి ఏర్పాటు చేసే వాటిని ఆ దేశంలో పింక్ టాయిలెట్స్ అంటారు. ఇక థాయ్ లాండ్ లో ష‌ర్ట్ లేకుండా కార్ న‌డ‌ప‌డాన్ని అత్యంత నేరంగా ప‌రిగ‌ణిస్తారు. అలాంటి వారికి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేస్తారు. ఇవే కాదు థాయ్ లాండ్ లో ఇంకా చాలా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నియ‌మాలు ఉన్నాయి.

Image result for thailand

థాయ్ లాండ్ లో ఆ దేశ క‌రెన్సీ మీద కాలుపెట్ట‌డం కూడా నేర‌మే. అలాంటి వారికి శిక్ష‌లు ఉంటాయి. ఇక మ‌న ద‌గ్గ‌ర అయితే మంగ‌ళ‌వారం క‌టింగ్ షాప్స్ బంద్అ చేస్తారు. థాయ్ లాండ్ లో మాత్రం అక్క‌డి క‌టింగ్ షాప్ లు బుధ‌వారం మూసివేస్తారు.ఇక చెప్పాలంటే మ‌న‌కు రాబోయేది 2017వ సంవ‌త్స‌రం. అయితే వారికి మాత్రం 2561వ సంవ‌త్స‌రం. వీటి అన్నింటికంటే ముఖ్య‌మైన‌ది వారి జాతీయ‌గీతం ప‌ట్ల వారికున్న అపార గౌర‌వం.

Image result for thailand

ఆ దేశంలో ఉద‌యం 8 గంట‌ల‌కొక‌సారి, సాయంత్రం 6 కు ఓసారి వారి జాతీయ గీతం లౌడ్ స్పీక‌ర్స్ లో ప్లే అవుతుంది. ఈ స‌మ‌యంలో ఎవ‌రు ఎక్క‌డున్నాక‌ద‌ల‌కుండా అలాగే నిల‌బ‌డి జాతీయ గీతాన్ని గౌర‌విస్తారు. ఈ రెండు స‌మ‌యాల్లో దాదాపు 2 నిమిషాల పాటు థాయ్ లాండ్ మొత్తం మౌనంగా ఉండిపోతుంది. ఇలా థాయ్ లాండ్ దేశస్తులు వారి జాతీయ గీతానికి అపార గౌర‌వం ఇస్తారు. ఇవి థాయ్ లాండ్ లో ఉన్న నియ‌మాలు.