3వేలతో సిటికి వచ్చి 3నెలల్లో 3కోట్లు గడించింది.. ఈవిడే ప్రియదర్శిని.. ఆమె స్టోరీ.

8822

ఇప్పటి వరకు ఎక్కువగా అమ్మాయిలే మోసపోతున్నారు అనే వార్తలే విన్నాం .. కానీ ఒక అమ్మాయి అబ్బాయిల తో పాటు సంస్థలను కూడా మోసం చేస్తోంది .. వహ్ నిజంగా ఘటికురాలే ..

ఈ క్రింది వీడియో చూడండి.

చెన్నై నుండి 3000 రూపాయల తో వచ్చిన ఈ అమ్మడు కోట్ల రూపాయలు దోచుకుంది. ఆమె గురించి తెలుసుకున్నవారు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ఇంతకి ఎవరు ఆ అమ్మాయి ఏమి చేస్తోంది అనే వివరాలోకి వెళ్తే ..

ఏదో ఒక రూపంలో పరిచయం అవుతుంది. పరిచయమైన రెండో రోజే ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అంటూ తన వలపు అందంతో ఎరేస్తుంది. పడ్డారా? ఇక అంతే .. వెంటనే పెళ్లంటుంది. ఆమె దగ్గర 100 కోట్ల ఆస్తి ఉందని, నిన్ను విడిచి క్షణం కూడా ఉండలేనని, కాదంటే చచ్చిపోతానని మాటలు చెప్పి ముగ్గులోకి దించుతుంది .

పరిచయాన్ని కొన్ని రోజుల్లోనే పెళ్లి వరకూ పరుగులు పెట్టిస్తుంది. ఇప్పుకుంటే నాలుగు రోజులు స్టార్ హోటళ్లలో జల్సా చేస్తుంది. ఏటీఎం కార్డుల్లోని డబ్బు తీయిస్తుంది. అందినంత నగదు, నగలు దోచుకుని మాయమవుతుంది..

ఇలా స్నేహం, ప్రేమ, పెళ్లి పేరు చెబుతూ తెలుగు యువకులను, ముఖ్యంగా డబ్బున్నవారిని ఎంచుకుని వల వేసే ఈ చెన్నై మాయా సుందరి ప్రస్తుత పేరు ప్రియదర్శిని.

గతం లో ఆమె చేతిలో బలయిన వారు చాల మందే ఉన్నారు. ఐతే ప్రియదర్శి దోపిడీకి గురైన ఓ వరంగల్ ప్రముఖుడి కుమారుడి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. తనను తాను డాక్టర్ గా పరిచయం చేసుకుని, ఇక అతగాడిని విడిచి ఉండలేనని వెంటబడి పడి , 5 రోజుల్లోనే పెళ్లి చేసుకుందని, తన డబ్బుతో స్టార్ హోటల్స్ లో జల్సా చేసి, లక్షల రూపాయలను షాపింగ్ కు ఖర్చు పెట్టిందని అంతేగాక, వరంగల్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా షోరూములో రూ. 75 లక్షలకు చెక్కులిచ్చి నాలుగు కార్లు కొనుగోలు చేయగా, అవి బౌన్స్ అయ్యాయని వెల్లడించారు.. అతని పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ..

ప్రస్తుతానికి ఇందులో తేలిన విషయాలు ప్రియదర్శిని అసలు పేరు స్నేహ.. ఆమె ఫోటోలు పోలీస్ విడుదల చేసారు . వరంగల్ మోసం జరిగాక ఆమె బెంగుళూరు పారిపోయిందని తెలిజేస్తున్నారు. ఆమె టార్గెట్ అంతా కూడా సంపన్నుల పిల్లలను ఎంచుకుని, వారిని ముగ్గులోకి దించి సీక్రెట్‌గా వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత అందిన కాడికి డబ్బు, నగలు దోచుకోవడమే ..ఐతే మిగితా వారంతా సేఫే అనే ఫీలింగ్ లో ఉంటారు .. దిన్ని బట్టి చూస్తే .. అమ్మాయి మాటలు కు పడని వారంటూ ఉండరు అని తెలుస్తుంది .. సినిమా కవి అన్నారు కదా ఎంత వారు గాని .. వేదంతులైన గాని వాలు సూపు సోకగానే తెలిపోదురు అని .. అలా తేలిపోయే ఇలా బొక్కబోర్ల పడ్డారు.