ఈ దంప‌తులు రోడ్డు మీద ప్ర‌యాణిస్తున్న వారిని ఆపి మ‌రీ ఓ గిఫ్ట్ ఇస్తుంటారు.! ఎందుకో తెలిస్తే నోరేల్లబెడతారు

831

స్వార్థం పెరిగిన ఈ రోజుల్లో కుటుంబాన్ని, సమాజాన్ని పట్టించుకునే వారు ఎందరు..? అనే ప్రశ్నకు వేళ్ల మీద లెక్కబెట్టదగిన వారే ఉంటారని చెప్పొచ్చు. ఎంతో మంది మహానుభావులు సామాజిక స్పృహ తో తమ వంతు సహాయాన్ని శ్రమ, ధనం, వస్తు రూపాలలో అర్హులైన వారికి అందజేస్తున్నవారున్నారు…సమాజ హితం కోసం ఎన్నో స్వచ్చంధ సంస్థలు విద్యార్ధుల చదువులని, పోషణ అని, అన్నదానాలని ఎదో రకంగా సమాజం కోసం తమ వంతు బాధ్యతగా తోడ్పడుతున్నారు.

కావాలంటే ఈ వీడియో చూడండి

అలాగే ఎందఱో ఆదర్శ దంపతులు తమ జీవితం లో కొంత సమయాన్ని సమాజానికి కృషి చేస్తున్నారు….సమాజం నాకేం ఇచ్చింది అని కాకుండా సమాజానికి నువ్వేం ఇచ్చావ్ అని మాట గుతున్చుకోవాలని బాధ్యతగా హెచ్చరిస్తున్నారు సామాజిక కార్యకర్తలు…

ఈ ఫోటోలో క‌నిపించే దంప‌తుల పేర్లు సందీప్, సున‌య‌న‌…సందీప్ ఢిల్లీ పోలీస్ విభాగంలో ప‌నిచేస్తుంటారు. ఇయ‌నకు నెల‌కు 40 వేల రూపాయ‌ల జీతం వ‌స్తుంది. ప్ర‌తి నెల వ‌చ్చిన జీతంలో స‌గం డ‌బ్బులు పెట్టి హెల్మెట్స్ కొంటారు. దీపావ‌ళి, ద‌స‌రా లాంటి పండ‌గైనా… బ‌ర్త్ డే, ఆనివ‌ర్స‌రీ డే లాంటి అకేష‌న్స్ అయినా…దంప‌తులిద్ద‌రూ క‌లిసి హైవే రోడ్డు మీద‌కు వ‌చ్చి హెల్మెట్ పెట్టుకోకుండా ప్ర‌యాణిస్తున్న టూ వీల‌ర్ వారిని ఆపి…వారికి హెల్మెట్స్ ను గిఫ్ట్స్ గా ఇస్తుంటారు. ఇలా గ‌డిచిన రెండేళ్ళ‌లో … ఈ దంప‌తులు 500 కు పైగా హెల్మెట్స్ ను గిప్ట్ గా ఇచ్చారు. ఇస్తూనే ఉన్నారు.!

దేశ వ్యాప్తంగా టూ వీల‌ర్ ప్ర‌మాదాల్లో 70 శాతానికి పైగా మ‌ర‌ణాలు త‌ల‌కు బ‌ల‌మైన గాయం వ‌ల్లే సంభ‌వించాయి.! హెల్మెట్ పెట్టుకున్న‌ట్టైతే క‌నీసం 50 శాతం మ‌ర‌ణాలైనా త‌గ్గేవి….అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న …దీనికి తోడు నా క‌ళ్ళ ముందు జ‌రిగిన ఓ సంఘ‌ట‌న కూడా న‌న్ను ఇలా ఆలోచించేలా చేసింది. 2016 డిసెంబ‌ర్ లో నేను మార్నింగ్ డ్యూటీ లో ఉన్న స‌మ‌యంలో… ఇద్ద‌రు పిల్ల‌లు, వాళ్ల పేరెంట్స్ టూ వీల‌ర్ మీద వ‌స్తున్నారు…

వారి వెనుకే వ‌స్తున్న ఓ కార్ బ‌లంగా వారిని ఢీ కొట్టింది….ఓ చిన్న పాప మిన‌హా ముగ్గురూ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.! చ‌నిపోయిన ముగ్గురు కూడా రోడ్డుకు వారి త‌ల బ‌లంగా ఢీ కొట్టుకోవ‌డం వ‌ల్లే చ‌నిపోయారు. విగ‌త‌జీవులుగా ప‌డి ఉన్న వారి త‌ల్లిదండ్రుల‌ను లేపుతూ ఆ చిన్నారి ఏడ్చిన ఏడ్పూ ఇప్ప‌టికీ నా గుండెల‌ను పిడేస్తుంటుంది. అందుకే అప్ప‌టి నుండి ఈ నిర్ణ‌యం తీసుకొని…మా ఇంట్లో జ‌రిగే ప్ర‌తి శుభ‌కార్యానికి హెల్మెట్స్ ను గిప్ట్ గా ఇవ్వ‌డం చేస్తున్నాను . కొన్ని కొన్ని పండగ‌ల‌కు కొత్త బ‌ట్ట‌లు కూడా కొన‌కుండా ఆ డ‌బ్బుల‌తో హెల్మెట్స్ కొన్న సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి.! చిన్న త‌ప్పిదం వ‌ల్ల జీవితాన్నే కొల్పోవొద్దు అనేది నే చెప్పాల‌నుకున్న విష‌యం.

అదండీ సంగతి పరుల కోసం పటు పడని మనిషి బ్రతుకు ఎందుకనీ అని ఓ కవి అన్న మాటలు అక్షర సత్యాలు మనిషి మనుగడకు వెలుగు బాటలు, ఈ మాటలను దృష్టిలో పెట్టుకుని మీకున్న సమయం లో కొంత సమయాన్ని సమాజానికి ఇచ్చి పక్కవాడికి సహాయపడమని పిలుపునిస్తున్నారు సామాజిక కార్యకర్తలు..