మీడియానుశాసిస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ ఒకప్పుడు ఏం చేసేవాడో చూస్తే షాక్

812

వేమూరి రాధాకృష్ణ‌. ఆంధ్ర‌జ్యోతి ఎండీ. తెలుగు రాష్ట్రాల్లోనే పేరు మోసిన బ‌డా మీడియా బాస్ ఆయ‌న‌. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు అత్యంత స‌న్నిహితుడు కూడా. తెలంగాణ‌లో జ‌న్మించిన ఆయ‌న‌, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. గ‌తంలో కేసీఆర్ తో అత్యంత స‌న్నిహితంగా మెలిగారు వేమూరి రాధాకృష్ణ‌, అయితే అసెంబ్లీలో జ‌రిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారాన్ని కామెడీగా చూపించినందుకు ఆంధ్ర‌జ్యోతి టీవీని బ్యాన్ చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.

ఈ క్రింది వీడియో చూడండి.

అయితే కేసీఆర్ తో కాంప్ర‌మైజ్ కు వ‌చ్చి ఈ వ్య‌వ‌హారాన్ని సెటిల్ మెంట్ చేసుకున్నారు రాధాకృష్ణ ఇక ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, రాధాకృష్ణ‌ల బంధం గురించి తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. ఒక‌ప్పుడు కిరోసిన్ అమ్ముకున్న వేమూరి రాధాకృష్ణ‌, నేడు ఆంధ్ర‌జ్యోతి ఎండీ అయ్యాడంటే అందులో చంద్ర‌బాబు ప్రోత్సాహం ఎంతో ఉంది.

Image result for vemuri radhakrishna
జ‌ర్న‌లిజం కెరీల్ ప్రారంభంలో ఆంధ్ర‌జ్యోతిలో ఓ ఏరియా స్ట్రింగ‌ర్ ప‌నిచేసిన రాధాకృష్ణ‌, అంచెలంచెలుగా ఎదిగాడు. సీనియ‌ర్ ఎన్టీఆర్ హాయాంలో టీడీపీ బీట్ ను చూసేకునేవారు. దాంతో టీడీపీ నాయ‌కులంద‌రితో స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌డ్డాయి. అలా చంద్ర‌బాబుతో కూడా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఓ సంద‌ర్బంలో ఆంధ్ర‌జ్యోతి న‌ష్టాల ఊబిలో చిక్కుకొక‌పోవ‌డంతో ఆ ప‌త్రిక‌ను మూసివేసింది యాజ‌మాన్యం. అయితే మూసివేసిన ఆంధ్ర‌జ్యోతిని తీసుకున్న వేమూరి రాధాకృష్ణ‌, త‌న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించుకుని నేడు నెంబ‌ర్ వ‌న్ సంస్థ‌గా నిల‌బెట్టాడు. అందులో చంద్ర‌బాబు ప్రోత్సాహం ఎంతో ఉందనే ప్ర‌చారం మీడియా వ‌ర్గాల్లో ఇప్ప‌టికీ బ‌లంగా ఉంది. ప్ర‌స్తుతం టీడీపీకి స‌పోర్ట్ చేస్తున్న మీడియాగా ఆంధ్ర‌జ్యోతిగా పేరు ఉంది. దీంతో వేమూరి రాధాకృష్ణ టీడీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు వెర‌తార‌నే ప్ర‌చారం కూడా జోరుగా సాగింది.

Image result for vemuri radhakrishna

అయితే వేమూరి రాధాకృష్ణ కు సంబంధించిన ఫోటో అంటూ తాజాగా ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌తిఒక్క‌రూ స్మార్ట్‌ఫోన్లు ఉప‌యోగిస్తున్నారు. చీమ చిటుక్కుమ‌న్నా తెలియ‌జేసే సోష‌ల్ మీడియా విస్తృతంగా అందుబాటులో ఉంది. దీంతో చాలా మంది చాలా వార్త‌ల‌ను కావాల‌ని వైర‌ల్ చేస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల్లో నిజం కంటే పుకార్లే ఎక్కువ ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో దేన్ని న‌మ్మాలో, దేన్ని న‌మ్మ‌కూడ‌దో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి వీక్ష‌కుల్లో నెలకొంది. ఇప్పుడు ఓ ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Image result for vemuri radhakrishna

ఈ ఫోటోలో కాపుల కుల దేవుడైన వంగవీటి రంగా వెనుక చేతులు క‌ట్టుకుని ఉన్న‌ది ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ అట‌. అవును, ఆ ఫొటోలో ఉన్న‌ది ఆయ‌నేన‌ని సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. ఆ ఫొటోలో ఉన్నది నిజంగానే రాధాకృష్ణ అని ఇప్పుడు వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో ఇప్పుడీ ఫొటోపైన పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుంది. అప్ప‌ట్లో వంగ‌వీటి రంగా వ‌ద్ద రాధాకృష్ణ కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేశాడ‌ట‌. ఆ స‌మ‌యంలో తీసిన ఫొటోయే ఇద‌ని చాలా మంది నెటిజ‌న్లు అంటున్నారు.

Image result for vemuri radhakrishna

అయితే దీనిపై ఆంధ్ర‌జ్యోతి స‌న్నిహితులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌ను ఆరా తీయ‌గా ఆ ఫొటోలో ఉన్న‌ది ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ కాద‌ని కొంద‌రు అన్నారు.మ‌రికొంద‌రేమో ఆయనే అయి ఉండ‌వ‌చ్చు, కానీ అప్పుడు ఆయ‌న డ్రైవ‌ర్ కాద‌ని, ఓ వార్త కోసం రంగా వెనుకాలే నిలుచున్నార‌ని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ ఫొటో మాత్రం నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే చివ‌రకు ఇది ఎక్క‌డ‌కు దారి తీస్తుందో వేచి చూడాలి..!

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!