ఖడ్గం సినిమా హీరోయిన్ ఇప్పుడేంటి ఇలా అయిపోయింది..?

898

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కోసారి కొంతమంది హీరోయిన్లు ఎందుకు వస్తారో, ఎందుకు తెర మరుగైపోతరో తెలీదు..అల వస్తారు మెరుపుతీగ లాగా ఇలా వెళ్ళిపోతారు…అవకాశాలు లేకనో, లేక మరే మరే ఇతర వ్యవహారాలతో నో పక్కకు తప్పుకుంటూ ఉంటారు…అలా ఉన్నట్టుండి తెరమరుగైన అందాల తారలు చాలానే ఉన్నారు…

ఈ క్రింది వీడియో చూడండి.

 

అలా కనపడకుండా పోయిన ఒకానొక హీరోయిన్ కిం శర్మ…అదేనండీ ముసుగు వేయొద్దు మనసు మీద..వలలు వేయొద్దు వయసు మీద..ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుఫానూ వేగాలతో…అంటూ కుర్రకారు మనసుదోచిన కిమ్ శర్మ ..తర్వాత ఒకట్రెండు సినిమాల్లో కనిపించి మాయమైంది..హిందీలో అడపాదడపా నటించినప్పటికీ పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన కిమ్ శర్మ..ఇప్పుడు ఏం చేస్తుంది..తెరపైకి ఏవిధంగా రంగ ప్రవేశం చేయనుందో తెలుసా…?

Related image

 

ముంబైలో ఒక పర్యటనలో భాగంగా క్లోజప్ టూత్ పేస్టు యాడ్ కోసం ఎంపికైన కిమ్ శర్మ .. తర్వాత ఆమె సన్ సిల్క్, పెప్సి, టాటా సఫారి, పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, క్లీన్-ఎన్-క్లియర్ మరియు లిరిల్ ప్రకటనలలో నటించింది. ఆదిత్య చోప్రా సహకారంతో తొలిసారిగా మొహబతీన్ చిత్రంలో నటించింది…బాలివుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కి కిమ్ శర్మ కజిన్ అవుతుంది..

Related image

హిందీలో చిత్రాలు చేస్తూ తెలుగులో కూడా మెరిసింది..మగధీర సినిమాలో రాంచరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో నటించింది కిమ్..సినిమాలకంటే ఎక్కువగా యువరాజ్ సింగ్ తో ఉన్న ఎఫైర్ మూలంగా వార్తల్లో నిలిచిందే ఎక్కువ..యువరాజ్ సింగ్ తో ప్రేమాయణం బ్రేక్ అప్ అయిన తర్వాత కెన్యాకు చెందిన వ్యాపారవేత్త అలీ పంజనీని 2010లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది…

Image result for kim sharma

ఇక ప్రస్తుతం ఈ భామ ఓ క్రికెట్ జట్టును కొనుగోలు చేసి ఆడిస్తుంది. ఈ మధ్యనే కెన్యాలో ఓ క్రికెట్ టీంను కొనుగోలు చేసింది. ఆ జట్టులో ఓ మూడునాలుగు టోర్నీలు కుడా గెలిచింది. ఈ జట్టులో సైమండ్స్, కేర్స్ వంటి దిగ్గజాలను కొని వారితో ఆడిస్తున్నది. ప్రస్తుతం ఈ భామకి ఈ జట్టు ద్వారా మంచి లాభాలే వస్తున్నాయి. సినిమాలు ఎలాగు లేకపోవడంతో ఈ బిజినెస్ బాగా కలసి రావడంతో ఇప్పుడు ఆమె దృష్టంతా ఈ టీం పైనే పెట్టింది.

Image result for kim sharma

ఇది ఇలా ఉంటె కిమ్ శర్మను తన భర్త, కెన్యాకు చెందిన బిజినెస్ టైకూన్ అలీ పుంజానీ వదిలేశాడని, దీంతో ఆమె ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే.. ఆ కథనాలపై కిమ్ స్పందించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆమె వాటిపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టి పారేశారు. నా దగ్గర డబ్బులు లేకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. కోల్డ్ ప్లే ఈవెంట్ కోసం బ్యాంకాక్ వెళ్లాను. వీకెండ్‌ను అక్కడ గడిపి తిరిగి ఇండియాకు వస్తే.. నా దగ్గర చిల్లి గవ్వ లేదంటూ వార్తలు పుట్టించేశారు. ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తున్నారో అర్థం కావట్లేదు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ఎలా రాస్తారు? నాపై వస్తున్న ప్రచారాల్లో నిజం లేదు అంటూ ట్విట్టర్లో స్పందించి కిమ్. ఇప్పుడు మళ్లీ ఒక పెద్ద టీవి షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందట ఈ భామ…మరి ఎలా అలరిస్తుందో చూడాలి…