హలో హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేదో చూస్తే నిద్రపట్టదు

1248

మొదటి సినిమా నిరాశ‌ప‌ర‌చ‌డంతో, రెండొ సినిమా హలో ద్వారా ఎట్ట‌కేల‌కు విజ‌యాన్ని అందుకున్నాడు అక్కినేని అఖిల్ . ఈ సినిమా కోసం అఖిల్ తో పాటు ,నాగార్జున కూడా బాగా కష్టపడ్డారు. హలో సినిమాతో అఖిల్ కు మంచి మార్కులే పడ్డాయి . జగపతిబాబు,రమ్యక్రిష్ణలాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి.

అన్న‌పూర్ణ స్టూడియో బ్యాన‌ర్ పై స్వ‌యంగా నాగార్జునే హ‌లో సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హారించారు. ఈ సినిమా క‌థ పాత‌దైనప్ప‌టికీ అఖిల్ న‌ట‌న‌, యాక్ష‌న్ సీన్స్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా లాభాల‌బాట ప‌డుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా విజ‌యాన్ని అందుకోవాల‌ని అఖిల్ ప‌డ్డిన శ్ర‌మ‌కు మంచి ఫలితం ద‌క్కింది.

Image result for kalyani priyadarshan

అయితే ఈ సినిమా ద్వారా తెలుగు తెర‌కు హీరోయిన్ గా కొత్త‌గా పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్..ఈ సినిమాలో జున్నుగా ప్రేక్షకుల మ‌న‌సుల‌ను గెలుచుకున్న కళ్యాణి గురించి ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. కళ్యాణి ప్రియదర్శన్ తల్లిదండ్రులు ఎవరో కాదు. తండ్రి ఫేమస్ డైరెక్టర్ ప్రియదర్శన్.

Image result for kalyani priyadarshan

ఆయ‌న మళయాలి దర్శకుడు. అంతేకాకుండా బాలివుడ్లో కూడా సినిమాలు తీశారు.. ఇక త‌ల్లి లిజి గ‌తంలో పెద్ద హీరోయిన్. ఇక లిజి ఆత్మబందువు,20వ శతాబ్దం సినిమా ద్వారా మనకు పరిచయమే..ఇప్పుడు నితిన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు..

Image result for kalyani priyadarshan

ఇక సినిమాల్లోకి రావడానికి ముందు సింగపూర్, న్యూయార్క్ సిటిలలో చదువుకుంది కళ్యాణి..ఈమెకు ఒక సోదరుడున్నాడు..అత‌ని పేరు సిద్దార్ద్ ప్రియదర్శన్. అయితే హీరోయిన్ కావడం కన్నా ముందు కళ్యాణి సినిమాల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది.సాబుసిరిల్ దగ్గర అసిస్టెంట్ గా క్రిష్ సినిమాకు ఆమె పనిచేసింది.

Related image

ఇక విక్రమ్,నయన్ నటించిన ఇరుమగన్ సినిమాకు కూడా వర్క్ చేసింది.ఒకప్పుడు చాాలా లావుగా ఉండే కళ్యాణి సినిమాల్లో హీరోయిన్ అవ్వడం కోసం పాతిక కిలోలు తగ్గింది.నజ్రియా అంటే కళ్యాణికి బాగా ఇష్టం..హిందీలో ఆలియా,దీపికా అంటే ఇష్టమట.మళయాళి నటుడు మోహన్ లాల్ నటన అంటే పిచ్చట కళ్యాణికి..నజీరుద్దిన్ షా,మోహన్ లాల్ సినిమాలు ఆమె మిస్ అవ్వకుండా చూస్తుంది.తన తల్లి లిజితో కలిసి నటించే అవకాశం వస్తే తప్పక చేస్తా అంటున్న కళ్యాణి ..తన తల్లితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎగ్జయిటింగ్ గా ఫీలవుతుందట.