హాస్పిటల్ లో ఈ నర్స్ చేసిన చిన్న తప్పు వల్ల ఏకంగా 5 వేల మంది బిడ్డలు తమ తల్లులకు దూరం అయ్యారు

151

చేసిన తప్పులు చెప్పుకుంటే పోతాయంటారు. తాను చేసిన తప్పేంటో మరణానికి చేరువ అవుతున్న సమయంలో తెలిసి వచ్చింది. మళ్లీ జన్మంటూ ఉంటే పాపానికి నివృత్తి చేసుకుంటానంటోంది జంబారియాకు చెందిన ఎలిజమిత్ బలియా మోయేవా. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె జాంబియాలోని యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌లో నర్సుగా 12 ఏళ్ల నుంచి పని చేస్తోంది. రోగుల ప్రాణాలు కాపాడ్డంలో డాక్టర్‌తో పాటు నర్స్‌కి సరిసమాన ప్రాముఖ్యత ఉంటుంది.

అక్కడి ఆసుపత్రిలో పని చేసినంత కాలం ఎలిజమిత్ గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేసిన వెంటనే ఒకరి పిల్లలను ఒకరికి మార్చేసేది. అలా మొత్తం ఒకటి రెండూ కాదు ఏకంగా 5 వేల మంది పిల్లను అలా ఒక తల్లి ఒడి నుంచి మరో తల్లి ఒడికి చేర్చేది. ఆసమయంలో తప్పు చేస్తున్నానన్న భావన కలగకపోగా అలా చేయడం చాలా సరదాగా అనిపించేదట ఆమెకు. ఇలా చేయడంతో కొంత మంది భార్యా భర్తల మధ్య గొడవలకు కూడా కారణమయ్యేది.

పుట్టిన బిడ్డ తమ సంతానం కాదంటూ డీఎన్‌ఏ టెస్టులకు వెళ్లిన వాళ్లు కూడా ఉన్నారట. అయినా కిమ్మనకుండా చోద్యం చూసేది. చేసిన పాపం ఊరికే పోదని.. కొంతకాలానికి ఆమె క్యాన్సర్‌కు గురైంది. దాంతో ఆ బాధను అనుభవిస్తున్న క్రమంలో తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. మరి కొద్ది రోజుల్లో నేను ఈ లోకం విడిచి వెళ్లి పోతాను. కానీ నా వల్ల ఎంతో మంది తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభను అనుభవించి ఉంటారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది.

తమ మొదటి బిడ్డ తాలూకూ పోలికలు 1983 నుంచి 1985 మధ్య పుట్టిన రెండో బిడ్డలో ఏమాత్రం లేవని ఎంత కలత చెంది ఉంటారో నాకు మాత్రమే తెలుసు. వారి ఉసురు ఊరికే పోలేదు. క్యాన్సర్ రూపంలో అది నన్ను కబళించింది. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం దేవుడు మళ్లీ కల్పిస్తాడని కోరుకుంటున్నాను అని మరణానికి కొద్ది రోజుల ముందు తన దగ్గరి బంధువులకు వివరించింది ఎలిజమిత్. ఆ నర్స్ చేసిన పనికి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..