గుడ్ న్యూస్: మార్కెట్ లోకి కొత్త స్కూటర్లు.. నో పెట్రోల్.. 200కి.మీ. మైలేజ్

1105

ఇండియ‌న్ ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల మార్కెట్ లో శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతున్న ఒకిన‌వ టూవీల‌ర్ల సంస్థ స‌రికొత్త టూవీల‌ర్ ను లాంచ్ చేసింది. పెట్రో స్కూట‌ర్ల‌కు ధీటుగా పోటీనిచ్చే ఒకిన‌వ తాజాగా విడుద‌ల చేసిన స్కూట‌ర్ల ధ‌ర 59,889 రూపాయ‌లు. గ‌త‌ ఏడాదిలో రెడ్ పేరిట స్కూట‌ర్ ను రిలీజ్ చేసిన ఆ సంస్థ‌, ఇప్పుడు ప్లైజ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను లాంచ్ చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి.

ఒకిన‌వ సంస్థ ప్రైజ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను ప్రీమియం మోడ‌ల్ గా ప్ర‌వేశ‌పెట్టింది. అత్యుత్త‌మ ఫ‌ర్ పామెన్స్, అత్యాధునిక ఫీచ‌ర్లు దీని సొంతం. ఈ స్కూట‌ర్ కు ముందు డిజైన్ లో ఆక‌ర్ష‌ణీయ‌మైన హెడ్ ల్యాంప్. ప‌గ‌టిపూట వెలిగే ఎల్ ఈడీ లైట్లు ఉన్నాయి. ఇక ఈ ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ లో వెయ్యి వాట్స్ కెపాసిటీ గ‌ల ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం క‌ల‌దు. ఇది గ‌రిష్టంగా 3.35 వీహెచ్ పీ ప‌వ‌ర్ విడుద‌ల చేస్తుంది.

Related imageఒకిన‌వ ప్లైజ్ స్కూట‌ర్ గ‌రిష్ట వేగం గంట‌కు 75కిలోమీట‌ర్లుగా ఉంది. దీని ప్ర‌కారం చూసుకుంటే ప్ర‌స్తుతం ఇండియ‌న్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న స్కూట‌ర్ లో అత్య‌ధిక వేగం ఉన్న స్కూట‌ర్ ఇదే. ఒక్క‌సారి ఛార్జీంగ్ తో 175 నుంచి 250 కిలోమీట‌ర్లు వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. అలాగే ఒక కిలోమీట‌ర్ కు కేవలం 15 పైస‌లు మాత్ర‌మే ఖ‌ర్చు అవుతుంద‌ని ఒకిన‌వ సంస్థ తెలిపింది. ఈ స్కూట‌ర్ కు విద్యుత్ యాసిట్ బ్యాట‌రీ నుంచి అందుతుంది.

Image result for okinawa scooter

ఈ బ్యాట‌రీ ఆరుగంట‌ల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. అతి త్వ‌ర‌లో అయాన్ బ్యాట‌రీతో మ‌రో స్కూట‌ర్ త‌యారుచేయ‌నున్న‌ట్లు ఒకిన‌వ సంస్థ‌ పేర్కొంది. కేవ‌లం రెండు గంటల్లోనే ఈ బ్యాట‌రీ చార్జింగ్ అవుతుంద‌ట‌. దాని ధ‌ర ఈ స్కూట‌ర్ కంటే ఆరు వేల రూపాయ‌లు ఎక్కువ ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Image result for okinawa scooter

ఒకిన‌వ ప్రీమియం స్కూట‌ర్ లో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. సైడ్ స్టాండ్ సెన్సార్, యాంటీ సెప్ట్ మెకానిజం లాంటి అనే ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇవే కాకుండా డిజిట‌ల్ ఇన్ స్ట్రూమెంట్స్, అంతేకాకుండా 9.5 లీట‌ర్ల అండ‌ర్ సీట్ స్టోలేజ్ క‌ల‌దు. ఈ స్కూట‌ర్ లో వెనుక వైపున రెండు డిస్క్, ముందుప‌క్క‌న సింగిల్ డెస్క్ బ్రేకులు ఉన్నాయి. ఈ బ్రేకుల మీద ఎల‌క్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్ట‌మ్ ఉంది. ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ 12 అంగుళాల‌ వీల్స్ మీద ప‌రుగులు పెడుతుంది.

Image result for okinawa scooter

ఈ స్కూట‌ర్ ను బుక్ చేసుకునేందుకు న‌వంబ‌ర్ 27 నుంచి బుకింగ్స్ ఆహ్వానించింది ఒకిన‌వ సంస్థ‌. రెండు వేల రూపాయ‌ల‌తో దీనిని బుక్ చేసుకొవ‌చ్చు. బుక్ చేసుకున్న వారికి ఈ నెల చివ‌రి నుంచి అందించ‌నుంది. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా 106 విక్ర‌య కేంద్రాలు ఉన్నాయి. 2018 లో మ‌రో 150 షోరూమ్ ల‌ను తెరిచేందుకు ఆ సంస్థ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.