హిజ్రాతో పెళ్లి, కాపురం.. మూడేళ్ల త‌ర్వాత దిమ్మతిరిగే షాక్!

1162

అత‌నోక ఆటో డ్రైవ‌ర్ . ఓ హిజ్రాతో ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది.ఆ ప్రేమ చిగురించి వివాహం వ‌ర‌కు చేరుకుంది. .నమ్మకంగా ఉంటూ దైవ సాక్షిగా ఓ హిజ్రాను వివాహం చేసుకున్నాడు..హిజ్రాను చ‌ర్చిలో పెళ్లిచేసుకున్నాడు. అన్నీ తానే అన్నాడు.. సమాజం ఏమనుకున్నా పర్వాలేదన్నాడు.పెళ్లి చేసుకున్న అనంత‌రం సహచర హిజ్రాలతో తిర‌గ‌వ‌ద్ద‌ని, అస‌లు హిజ్రాల‌తో మాట్లాడ‌వ‌ద్ద‌ని షరతులు కూడా పెట్టాడు..

ఈ క్రింది వీడియో చూడండి.

పుట్టిన రోజు, పెళ్లి రోజుల్లో ప్రార్థనలు పెట్టించి, క్రైస్తవ పెద్దలకు ఆత్మీయ విందు కూడా ఏర్పాటు చేసేవాడు.. పెళ్లి త‌ర్వాత ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టేశాడు. అయితే మూడేళ్ల త‌ర్వాత హిజ్రాకు మొహం చాటేశాడు. హిజ్రా సంపాదించిన డ‌బ్బుల‌న్నీ లాక్కొని ఇంటి నుంచి క‌న‌ప‌డ‌కుండా వెళ్లిపోయాడు. దీంతో ఆ హిజ్రా పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న‌కు న్యాయం చేయాల‌ని పోలీసుల‌ను వేడుకుంటోంది.

Image result for auto driver

ఈ ఘ‌ట‌న విజ‌య‌వాడ సిటీలో చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రాంతానికి చెందిన హిజ్రా సనా ఐదేళ్ల క్రితం పాయకాపురం కండ్రికకు వచ్చి స్థానికంగా ఉన్న హిజ్రాలతో కలసి జీవ‌నం సాగిస్తుండేది. ఈ క్ర‌మంలో అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ చింతా వినయ్‌కుమార్‌ పరిచయమయ్యాడు.

Related image

అయితే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో మూడేళ్ల క్రితం సనాను వినయ్‌కుమార్ స్థానికంగా ఉన్న చర్చిలో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ న్యూ రాజరా జేశ్వరిపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. కొద్ది రోజుల పాటు వీరి దాంపత్య జీవితం బాగానే కొన‌సాగింది. హిజ్రాలతో సంబంధాలు తెంపుకోని భర్తతోనే జీవితం సాగిస్తుంది. అయితే భిక్షాటన, రికార్డింగ్‌ డ్యాన్స్‌లకు వెళ్లి హిజ్రా సనా సంపాదిస్తున్న డబ్బులను వినయ్‌కుమార్‌ తీసుకున్నాడు.

Related image

కాలికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు అప్పులు చేసి బీరువాలో భద్రపరచిన రూ.42 వేలు కూడా తీసుకెళ్లిన విన‌య్ గ‌త కొద్ది రోజులుగాఇంటికి రావడం లేదు.దీంతో స‌నా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. స్థానికంగా అందరి వద్ద అప్పులు తీసుకుని ఇప్పటి వరకు రూ.4 లక్షలు ఇచ్చానని, తన పై దాడి చేసి శస్త్ర చికిత్స కోసం ఉంచిన డబ్బులు కూడా తీసుకెళ్లాడని సనా ఫిర్యాదులో పేర్కొంది.

Image result for hijra

తన భర్తను తనకు దగ్గరన్న చేయాలని, లేని పక్షంలో తాను అప్పులు చేసి ఇచ్చిన డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరుతూ ఏకంగా పోలీస్‌ కమిషనర్‌ను ఆశ్రయించింది. తన సహచర సంఘ సభ్యుల నుంచి దూరం చేయడంతో పాటు తనను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నా వినయ్‌కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని హిజ్రా కోరుతోంది.