వైసీపీలో చేరిన ప్రముఖులు..!

126

ఆమంచి కృష్ణ‌మోహ‌న్

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ క‌రెక్ట్ టైమ్‌లో టీడీపీకి గుడ్‌బై చెప్పేసారు. ఆయ‌న కూడా వైసీపీలో చేర‌నున్నార‌ని ప్ర‌క‌టించేశారు. మంచి రోజు చూసుకుని అధికారికంగా చేర‌నున్నారు.

ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూడా వైసీపీలో చేర‌డం విశేషం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ నుండి అసెంబ్లీ బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

సి.రామ‌చంద్రయ్య

మాజీ మంత్రి సి.రామ‌చంద్రయ్య కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల వైసీపీలో చేరారు.ఆయన తొలుత టీడీపీలో ఉన్న రామ‌చంద్ర‌య్య , త‌ర్వాత పీఆర్పీ, చివరగా కాంగ్రెస్‌లో ప‌నిచేశారు. ఇటీవల టీడీపీతో కాంగ్రెస్ పొత్తుపొట్టుకోడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరారు.


ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, హితేశ్ చెంచురాం

మాజీ కేంద్ర‌మంత్రి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న కుమారుడు హితేశ్ చెంచురాంతో క‌లిసి వైసీపీలో చేర‌నున్నార‌ని మీడియా ముఖ్యంగా తెలిపారు. ప‌ర్చూరు నుండి వైసీపీ అభ్య‌ర్ధిగా హితేష్ పోటీ చేస్తారని తెలుస్తోంది.

కాట‌సాని రాంభూపాల్ రెడ్డి

ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కాట‌సాని రాంభూపాల్ రెడ్డి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. త‌ర్వాత బీజేపీలో చేరారు. అయితే రాష్ట్రంలో ఎన్నిక‌ల స‌మీపిస్తున్న త‌రుణంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

మ‌ల్లాది విష్ణు

విజ‌య‌వాడ మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు కాంగ్రెస్ వీడి వైసీపీలో చేరారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టిక్కెట్ మ‌ల్లాది విష్ణుకే ఇవ్వ‌నున్నార‌ని తేల‌డంతో, అసంతృప్తి వ్య‌క్తం చేసిన వంగ‌వీటి రాధా వైసీపీని వీడారు. 

మానుగుంట‌ మ‌హిధ‌ర్ రెడ్డి

కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా ప‌ని చేసిన మానుగుంట‌ మ‌హిధ‌ర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌కు గ‌డ్ బై చెప్పేసి వైసీపీ గూటికి చేరారు. ఇక వైసీపీ త‌రుపున వ‌చ్చే ఎన్నిక‌ల్లో కందుకూరు నుంచి పోటీ చేయ‌బోతున్నారు.మేడా మ‌ల్లికార్జున రెడ్డి

రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ త‌రుపున‌ రాజంపేట్ అసెంబ్లీ బ‌రిలో దిగ‌నున్నార‌ని స‌మాచారం.

ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు

అన‌కాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు తాజాగా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో ఒక్క‌సారిగా తెలుగ‌దేశం పార్టీలో క‌ల‌క‌లం రేపింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున ఎక్క‌డ పోటీ చేస్తారో తెలియాల్సి ఉంది.

పండుల ర‌వీంద్ర‌బాబు

అమ‌లాపురం ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు కూడా తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ.. వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మొద‌ట టీడీపీని వీడ‌న‌ని చెప్పిన రెండు రోజుల‌కే ర‌వీంద్ర‌బాబు వైసీపీలో చేర‌డం గ‌మ‌నార్హం.

పొన్నాడ స‌తీశ్

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీశ్, కూడా వైసీపీలో చేరారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ స్థానంలో పోటీ చేస్తారో తెలియాల్సి ఉంది.