రేషన్ కార్డ్ ఉన్న ప్రతి మహిళకు 75000/-

181

నవ్యాంధ్రప్రదేశ్లో ఏడింట ఆరొంతుల మెజార్టీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసారు. ఈ నేపథ్యంలో మిగతా హామీలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలు, వాటికి అయ్యే బడ్జెట్పై లెక్కలు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్లో ఏ మేరకు హామీల అమలును నెరవేరుస్తారు, ప్రజలకు ఏం గుడ్ న్యూస్ చెబుతారనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన కొన్ని హామీలు చూద్దాం. ఇందులో పలు హామీలు నెరవేర్చారు. మరికొన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు.

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు రావడం. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా దశ దిశ మార్చడం, కిడ్నీ సహా దీర్ఘకాలిక వ్యాదిగ్రస్తులకు నెలకు రూ.10వేల పింఛన్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో సరే ఎక్కడైనా ఆరోగ్యశ్రీ వర్తింపు. వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు. పింఛన్ అర్హత 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు. దశలవారీగా మద్యపాన నిషేధం. ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాల భర్తీ. అయిదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం, శ్రీవారి సన్నిధిలు తలుపులు తీసే అవకాశం గొల్లలకు కల్పించడం.. ఇలా పలు హామీలు ఇచ్చారు.

ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల పెళ్లి కానుక కింద రూ.లక్ష, బీసీ అమ్మాయిలకు రూ.50వేల ఆర్థిక సాయం. కాపు కార్పోరేషన్కు రూ.2వేల కోట్లు. బీసీ, ఎస్సీ కార్పోరేషన్లు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు. అర్చకులకు రిటైర్మెంట్ విధానం రద్దు. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణం. పిల్లల్ని బడికి పంపిస్తే ప్రతి తల్లికి ఏడాదికి అమ్మఒడి పథకం కింద రూ.15,000. ఇతర ప్రాంతాల్లో చదువుకునే పిల్లలకు హాస్టల్ ఖర్చు కింద రూ.20,000. పింఛన్ల పెంపు. వికలాంగులకు రూ.3వేలు. ఇళ్లులేని పేదలకు వారి పేరు మీదే ఇంటిస్థలం కొని రిజిస్ట్రేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 45 ఏళ్లకే వైయస్సార్ చేయూత.

వివిధ ప్రాజెక్టుల పూర్తి. చెరువుల పునరుద్ధరణ. రక్షిత మంచినీరు అందించడం. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం. గ్రామ సచివాలయం ఏర్పాటు ద్వారా అదే గ్రామానికి చెందిన యువకులకు ఉద్యోగ అవకాశం. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్. వారికి నెలకు రూ.5వేల వేతనం. ప్రభుత్వ పథకాల తీరును వారే అమలు చేస్తారు. రేషన్ వస్తువులు ఇంటికే తెచ్చి ఇవ్వడం. పరిశ్రమలకు కావాల్సిన స్కిల్స్ ఆదారంగా యువతకు శిక్షణ. బీసీల అభ్యున్నతికి రూ.15వేల కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.75వేల కోట్లు ఖర్చు. దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ కమిటీలు, అన్ని కార్పోరేషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్. ప్రాతినిథ్యం లేని కులాలకు చట్టసభల్లో అవకాశం. మత్స్యకారుల పడవలకు ఆర్థిక సాయం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.24వేలు. చిరు వ్యాపారస్తులకు గుర్తింపు కార్డు. సున్నాకే రూ.10వేల వడ్డీ.

వైయస్సార్ చేయూత ఈ పథకం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు. జగన్ అన్న రాగానే 45ఏళ్ళు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరికి 75వేల రూపాయలు ఉచితంగా ఇచ్చి వారికి చేయూతను ఇచ్చే కార్యక్రమం జగన్ చేస్తాము అని చెప్పారు ఇప్పుడు ఈ వైయస్సార్ చేయూత కార్యక్రమం అమలుకు రెడీ అయ్యారు. బీసీ ఎస్సీ ఎస్టీ లకు నాలుగు విడతల్లో ఈ డబ్బులు ఇస్తారు. ఈ పథకానికి ఏజ్ లిమిట్ 45 ఏళ్లు ఉండాలి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ సచివాలయంలో దీనిని అప్లై చేసుకోవాలి.

గ్రామ సచివాలయం అక్టోబర్ రెండొవ తేదిన ఓపెన్ అవుతుంది… ఇక గ్రామ సచివాలయంలో ఉద్యోగులు ఆగస్టు 15 న చేరుతారు. నాలుగు విడతల్లో ఒక్కో విడతలో 19 వేల రూపాయలు విడుదల చేస్తారు. వీటిని కేవలం గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవాలి అర్హులు అయిన వారందరికి ఈ పథకం ఇవ్వనున్నారు.