నెలకు రూ.5,000 పెన్షన్ …

2656

పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందించే స్కీంలలో నేషనల్ పెన్షన్ స్కీం (NPS) ఒకటి. రెండేళ్ల కిందట పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Pension Fund Regulatory and Development Authority-PFRDA) వయస్సు పరిమితిని పెంచింది. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పథకంలో చేరవచ్చు. 60 ఏళ్ల తర్వాత NPSలో చేరినవారు 70ఏళ్ల వరకు కొనసాగవచ్చు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

SBI పెన్షన్ ఫండ్ NPS క్యాలిక్యులేషన్ ప్రకారం 65 ఏళ్లలో స్కీంలో చేరిన వారు నెలకు రూ.4,924 పెన్షన్ పొందవచ్చు. 70 ఏళ్ల వరకు స్కీంను కొనసాగించాలి. నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేయాలి. 70 ఏళ్ల తర్వాత వారికి రూ.4,924 పెన్షన్ వస్తుంది. ఇక్కడ రాబడిని ఎనిమిది శాతంగా అంచనా వేశారు. దీనికంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపు రూ.4వేలు పొందవచ్చు. నెలకు రూ.5వేలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపు రూ.2వేలు పెన్షన్ పొందవచ్చు.

నేషనల్ పెన్షన్ స్కీం (NPS) చెల్లింపులకు పేటీఎం మనీ యాప్కు అప్రూవల్ వచ్చింది. ఈ మేరకు బుధవారం నాడు పేటీఎం యాజమాన్యం వెల్లడించింది. తమ ప్లాట్ఫాం నుంచి NPSలో ఇన్వెస్ట్ చేసేందుకు PFRDA నుంచి అనుమతి లభించిందని పేర్కొన్నారు. పేటీఎం మనీలో నమోదైన వారు NPSలో నిమిషాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చునని చెప్పారు. NPS పెట్టుబడిని పేపర్లెస్గా పేటీఎం మనీ చేస్తోంది. ఇది డిజిటల్ టు డిజిటల్. స్టాక్ బ్రోకింగ్ సర్వీసుల కోసం తమకు సెబి నుంచి అనుమతులు వచ్చాయని కూడా ఇటీవల పేటీఎం వెల్లడించింది. గత నెల ఇండియా వ్యాప్తంగా 40 అసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీల మ్యుచువల్ ఫండ్స్ స్కీంలు ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు పేటీఎం మనీ యాప్ ద్వారా NPS స్కీంలో నిమిషాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

మేజర్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్… ఎల్ఐసీ పెన్షన్ ఫండ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్, రిలయన్స్ కేపిటల్ పెన్షన్ ఫండ్, డీఎస్పీ బ్లాక్రాక్, రిలయన్స్ కేపిటల్ పెన్షన్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్స్ మేనేజ్మెంట్, కొటక్ మహింద్రా పెన్షన్ ఫండ్, బిర్లా సన్ లైఫ్ పెన్షన్ వంటివి పేటీఎం మనీలో అందుబాటులో ఉన్నాయి.

పేటీఎం మనీ ద్వారా NPSలో ఇన్వెస్ట్ ఎలా చేయాలంటే..

NPSల పెట్టుబడి పెడితే 12 అంకెల యూనిక్ నెంబర్ ఇస్తారు. దీనిని పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (PRAN)గా పిలుస్తారు. టయర్ 1, టయర్ 2 అకౌంట్స్ ఉంటాయి. మొదటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ అయ్యేదాకా మీరు దానిని విత్ డ్రా చేయలేరు. టయర్ 1 అకౌంట్కు ఐటీ చట్టం సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. టయర్ 2 స్వచ్చంధంగా ఓపెన్ చేసే అకౌంట్. ఇందులో రిటైర్మెంట్కు ముందే తమ అమౌంట్ విత్ డ్రా చేసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు.

మరి ఈ స్కీమ్ గురించి మీ అభిప్రాయాలను సలహాలను కామెంట్స్ రూపం లో తెలియజేయండి.. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి… షేర్ చేయండి.. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా ఛానల్ ని Subscribe చేయండి…