కొత్త ట్రాఫిక్ రూల్స్.. పొరపాటున ఈ తప్పు చేస్తే లక్ష రూపాయల ఫైన్..

311

బైక్ మీద వెళ్తూ.. “మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూపానులా రెచ్చిపొమ్మన్నది” అనుకుంటూ రయ్యిమని దూసుకెళ్దామనుకుంటున్నారా..? ఇక మీ ఆటలు సాగవు. సరదా రైడ్ కోసం వాహనం తీసి షికారుకెళ్లే క్రమంలో నియమాలను అతిక్రమించి వాహనం నడిపితే మీరు సక్రమంగా, సకాలంలో ఇంటికి చేరడం కష్టమే.. నియమాలను అతిక్రమించి అతివేగంతో వాహనం నడిపితే మీరు జైలుకు, మీ వాహనం పోలీసు స్టేషన్ కి వెళ్లడం ఖాయం. అంతే కాకుండా రోజులో ఎన్నిసార్లు నియామాలను ఉల్లంఘిస్తే అన్నిసార్లూ ఫైన్ కట్టాల్సిందే.. అందుకే వాహన దారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పరిమితులను పట్టించుకోకుండా వాహనాల్లో రయ్యిమంటూ దూసుకువెళ్లే వారికిక గడ్డుకాలమే. ఇలాంటివారు ఒకేరోజు నాలుగైదుసార్లు నిబంధనలను ఉల్లంఘిస్తే.. అన్నిసార్లూ జరిమానా చెల్లించుకోక తప్పదు. ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రోడ్డు ప్రమాదంలో గాయపడటం..చనిపోవడం జరుగుతుంది. పట్టణాల్లో కీలకమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నా ఏదో ఒక మార్గం ద్వారా తాగుబోతు రాయుళ్లు తప్పించుకోవడం ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగడం అవుతుంది. డ్రైవర్లనిర్లక్ష్యం అతి వేగం రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలు అవుతున్నాయి. తాజాగా డ్రైవింగ్ చేస్తున్నవారు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి కొత్త విధానాలు అమలు పరుస్తున్నారు. ఈ రూల్స్ పాటించని వారికి భారీగా జరిమానా జైలు శిక్ష వేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. అయితే జరిమానా కూడా భారీగానే విధిస్తున్నారు.

-లైసెన్స్ లేకుండా నడిపితే – రూ.5000
-అతి వేగంగా నడిపితే – రూ.2000
-ప్రమాదకరంగా నడిపితే – రూ.5000

 • మద్యం మత్తులో నడిపితే (డ్రంకెన్) – రూ.10,000
 • హెల్మెట్ లేకండా నడిపితే – రూ.1000+ నెలలు డ్రైవింగ్ సస్పెన్షన్
 • ద్విచక్ర వాహనంపై వెనుక ఉన్నవారు -హెల్మెట్ ధరించకపోతే – రూ.1000
  -ఇన్సూరెన్స్ చేయించపోతే – రూ.2000
  -అంబులెన్స్ కి దారివ్వకపోతే – రూ.10,000
 • అనర్హలని తేల్చినా వాహనం నడిపితే – 10,000
 • పిల్లలు నడిపితే సంరక్షకులకు శిక్ష – రూ.25 వేలు + 3 ఏళ్లు జైలు +లైసెన్స్ రద్దు
 • ఆదేశాలు ఉల్లంఘిస్తే – రూ.2000
 • సీటు బెల్టు ధరించకపోతే – రూ.1000
  -ఓవర్ లోడింగ్ చేస్తే – రూ.20,000
  -ఎగ్రిగేటర్స్ (ఓలా, ఊబర్ లాంటివి) – రూ.1,00,000
  -లైసెన్స్ ఉల్లంఘనకు పాల్పపడితే , ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘిస్తే – జరిమానా రెట్టింపు ఉంటుంది.

జరిమానాలు చెల్లించని పక్షంలో వాహనాలు స్వాధీనం చేసుకోనున్నారు. అంతే కాకుండా నాన్ మెయిలబుల్ కేసులు కూడా పెట్టాలని పోలీసులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి జాగ్రత్త.. మరి ట్రాఫిక్ పోలీసులు తెచ్చిన ఈ కొత్త రూల్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.