AP ప్రజలకి షాకిచ్చిన జగన్ అమ్మ ఒడి కొందరికే.. 15000 వీళ్ళకి మాత్రమే..

150

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అమ్మ ఒడి పథకంపై స్పష్టత వచ్చింది. పథకానికి సంబంధించిన కీలక అంశాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. సర్కారీ బడులకు పంపించే పిల్లలకు మాత్రమే అమ్మఒడి పథకం కింద రూ.15వేల అందజేస్తామన్నారు.

వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా.. అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పథకం అమలుపై ఫోకస్ పెట్టారు. మంత్రివర్గంలో చర్చించి.. జనవరి 26 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాజన్న బడిబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు.

కొద్దిరోజులుగా అమ్మ ఒడి పథకంపై స్పష్టత లేకుండా పోయింది. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలకేనా.. ప్రైవేట్ స్కూళ్లకు వవర్తిస్తుందా అన్న సందిగ్ధం ఉంది. ఇదే విషయంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. ఏ స్కూలుకు పంపినా రూ.15వేలు అందజేస్తారని ప్రచారం జరిగింది. విద్యావేత్తలు కూడా ఈ పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింప చేయాలని అభిప్రాయపడ్డారు. అందుకే తల్లిదండ్రులకు అనుమానాలు లేకుండా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరి ఈ పథకం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం లో తెలియజేయండి..