జగన్ కారు డ్రైవర్ స్పెషల్ ఏంటి ? అతని జీతం ఎంతో తెలిస్తే అస్సలు నమ్మలేరు..

182

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (జగన్) ఆంధ్రప్రదేశ్రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వై.ఎస్. రాజశేఖర రెడ్డికుమారుడు. జగన్ 2009 మే లో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు, రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత, భారత జాతీయ కాంగ్రెస్ తో విబేధాలు కారణంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్టీని స్థాపించి, కాంగ్రెస్ ని చీల్చాడు. 2014 ఎన్నికలలో పార్టీ వోటమి పాలైనా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం , సండూరు జలవిద్యుత్ కేంద్రము ఆయనే స్ధాపించారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి

2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 30.5.2019 ఉదయం 12 గంటల 23 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు.

గత నెల 30న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చెసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేక కాన్వాయ్ ఆనాడు సిద్ధమైంది. నిన్నటివరకూ సీఎంగా ఉన్న చంద్రబాబు కోసం ఉపయోగించిన కాన్వాయ్ కాకుండా… భద్రతా కారణాల రీత్యా… అత్యంత శక్తిమంతమైన, అధునాతమైన, ఎన్నో సెక్యూరిటీ ఫీచర్లు ఉన్న కాన్వాయ్‌ని జగన్ కోసం సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని జగన్ ఇంటి దగ్గర భద్రతను పెంచిన పోలీసులు, ప్రస్తుతం అక్కడ చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేసేంత సెక్యూరిటీ ఉంచారు. ఆ ప్రాంతం మొత్తం మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. చుట్టుపక్కల ఇళ్లలో కూడా ఫార్మాల్టీ కొద్దీ సోదాలు చేశారు. తద్వారా ఆ ప్రాంతం పూర్తిగా సెక్యూరిటీ జోన్లోకి వచ్చేసింది. ఇప్పుడది ఫుల్ కంట్రోల్లో ఉంది. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు.

వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ఆరు స్ట్రామ్ వాహనాలు సిద్ధం చేశారు. వాటిలో ఒక బులెట్ ప్రూఫ్ వాహనం ఉంది. AP 18P 3418 నంబర్‌తో ఈ కాన్వాయ్ వెళ్తుంది. ఇందులో మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాల్ని ఏర్పాటు చేశారు.
మరి సాదారణమైన వ్యక్తులే తమ డ్రైవర్లకు వేలల్లో జీతాలు ఇస్తారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకంటూ ప్రత్యేకంగా టీమ్ ఉంటుంది ముఖ్యంగా ఆయనకు ఎలాంటి అపాయం జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. అందుకే జగన్ పర్యటనలు అన్నీ వారే చూసుకుంటారు వ్యక్తిగత భద్రత సిబ్బంది ఐపీఎస్ అధికారులు
చూసుకుంటారు.

ఇక జగన్ ఎక్కడికి వెళ్లినా ఆయనను తీసుకువెళ్లడానికి ప్రభుత్వం తరపున ఇద్దరు డ్రైవర్లు ఉంటారు.. ఒకరు ఒక షిఫ్ట్ మరొకరు నైట్ ఫిఫ్ట్ ఉంటారు. ఎలాంటి పరిస్దితి వచ్చినా జగన్ అనుకున్న సమయానికి ఎలాంటి హాని లేకుండా కారుని నడపాలి.. ముఖ్యంగా ఇలాంటి డ్రైవర్లకు ఎన్నో టెస్టులు పెట్టీ మరీ ప్రభుత్వం తీసుకుంటుంది .జగన్ కు అత్యంత బాగా తెలిసిన వ్యక్తిని తన డ్రైవర్ గా నియమించుకున్నారట జగన్. ఇక అతనికి నెలకు 1.50 లక్షల రూపాయల జీతం కూడా చెల్లిస్తున్నారు, ఎక్కడికి వెళ్లినా క్షేమంగా తీసుకురావాలి అని జగన్ ఫ్యామిలీ మరి మరీ ఆ డ్రైవర్ కు చెబుతారట….నమ్మకమైన డ్రైవర్ కాబట్టి అతనికి 1.50 లక్షల రూపాయల జీతం ఇస్తున్నారు అని చెబుతున్నారు కొందరు పార్టీ నేతలు.. ఇక మరో సీనియర్ డ్రైవర్ కు కూడా లక్ష రూపాయల జీతం ఇస్తున్నారట.ఎంతైనా సీఎంకు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు ప్రజలు.