రుణమాఫీ చెయ్యను.. AP ప్రజలకు దిమ్మతిరిగే షాకిచ్చిన CM జగన్

3298

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రైతులకు తొలి చేదు కబురు వచ్చింది. రైతురుణమాఫీలో మిగిలిపోయిన వాయిదాలను చెల్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. రుణమాఫీ హామీ తమ పార్టీది కాదని ఆ పార్టీ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు పెండింగ్‌లో ఉన్న రుణమాఫీని ఏపీ ప్రభుత్వం ఇక చెల్లించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ మేరకు తమ పార్టీ విధానాన్ని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. చంద్రబాబు రుణమాఫీ ప్రకటన పార్టీ తరపున చేశారని ఉమ్మారెడ్డి చెప్పారు. పార్టీ వాగ్దానానికి, ప్రభుత్వ వాగ్దానానికి తేడా ఉంటుందన్నారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

చంద్రబాబు 87వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారన ఐదేళ్లలో చంద్రబాబు రూ. 11,400 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. మిగతా రుణాలు ఈ ప్రభుత్వం మాఫీ చేయాలనడం అవివేకమన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రైతు రుణమాఫీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకు లక్షన్నర చొప్పున రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. లోటు బడ్జెట్ ఉన్నందున ఐదు విడతల్లో ఈ పక్రియ పూర్తి చేయాలనుకున్నారు. యాభై వేల రూపాయల లోపు ఉన్న రుణాలను ఒక్క విడతలోనే మాఫీ చేశారు. అంత కంటే ఎక్కువ ఉన్న వారికి ఐదు విడతల్లో రుణవిముక్తి చేయాలని సంకల్పించారు. ఎన్నికల నాటికి మూడు విడతలుగా రుణమాఫీ పూర్తయింది. ఎన్నికలకు ముందు నాలుగో విడత రూ. 3,900 కోట్లను విడుదల చేసింది. బ్యాంకుల్లో తమ రుణవిమోచన పత్రాలు చూపి వివరాలు అప్ లోడ్ చేసుకున్న కొంత మందికి మాత్రమే నాలుగో విడత అందింది. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు మారడంతో ప్రక్రియ ఆగిపోయింది.

ఆ తర్వాత ప్రభుత్వం మారింది విడతల వారీగా రుణమాఫీ చేయాలని నిర్ణయించుకున్నందున రైతుల వడ్డీ భారం కూడా మోయాలనుకుంటున్నారు. ఏడాదికి పదిశాతం వడ్డీ చొప్పున లెక్కించి ఇస్తున్నారు. అర్హులైన రైతులందరికీ రుణ ఉపశమన పత్రాలు ఇచ్చారు. ఈ పత్రాలు ఇప్పుడు పని చేయవని వారికి రుణమాఫీ చేసే అవకాశం లేదని దాదాపుగా తేల్చేసినట్లయింది. లక్షన్నర రుణమాఫీ అయిన కుటుంబానికి నాలుగో విడతలో 30వేలు అసలు 9వేలు వడ్డీ ఇవ్వాల్సి ఉంది. అలాగే చివరి విడతలో మరో పాతికవేలు ఇవ్వాల్సి ఉంది. దీని వల్ల ఒక్కో రైతుకు.. దాదాపుగా 50 వేల వరకూ నష్టం జరిగే అవకాశం ఉంది. రైతులకు సంబంధించి ఎన్నో నిర్ణయాలు తీసుకున్న సర్కార్ రుణమాఫీ విషయంలోనూ సానుకూలంగా వ్యవహరించాలనేది రైతుల అభిప్రాయం. నిర్ణయం ఎవరు తీసుకున్నా రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందంటున్నారు. చూడాలి మరి జగన్ రైతుల మీద కనికరం ఉంచి రుణమాఫీ చేస్తాడో లేదో. మరి జగన్ రైతురుణమాఫీ విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.