రైతు భరోసా రూ. 13,500/- రాకపోతే ఏం చేయాలి ?

74

ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా పథకం అమల్లోకి వచ్చింది. నెల్లూరు జిల్లా… కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్… పథకాన్ని ప్రారంభించి… కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో పాటూ… రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఈ రైతు భరోసా పథకానికి రూ.5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్కీం ద్వారా… ఏపీలో 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది. 3 లక్షల మంది కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందని వివరించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు… మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రైతు భరోసా పథకం వర్తించదు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఈ పథకం కింద ప్రయోజనం పొందగలగుతారు అని చెప్పింది ప్ర‌భుత్వం

ఈ రైతు భరోసా పథకం ప్రారంభానికి ముందు రోజే… ఏపీ ప్రభుత్వం రైతులకు ఆనందం కలిగించే నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ పెంచారు. పెట్టుబడి సాయాన్ని రూ.12,500కు బదులు రూ.13,500 ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. అంతేకాదు నాలుగేళ్లకు ఐదేళ్ల పాటు పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఏటా రూ.13,500ను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తామన్న కన్నబాబు… మూడు విడతల్లో రైతు భరోసా డబ్బును పంపిణీ చేస్తామని వివరించారు. మేలో రూ.7,500, రబీలో రూ.4,000, సంక్రాంతికి రూ.2వేలు ఇస్తామని చెప్పారు. రైతులు, రైతు ప్రతినిధి సంఘాల డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి.

అయితే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ ప‌థ‌కంలో 6000వేల రూపాయ‌ల‌తో పాటు ఇది మ‌రో 7500 ఇస్తుంది రాష్ట్ర ప్ర‌భుత్వం.. అందుకే దీనిని రైతు భ‌రోసా పీఎం కిసాన్ అని పేరు పెట్టారు. ఇక పీఎం కిసాన్ 2000 వేలు మూడోవిడ‌త‌లో రాక‌పోతే, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం భాగంగా 9500 మీకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది… ఇది కేవ‌లం మూడో విడ‌త‌లో డ‌బ్బులు రాని వారికి మాత్ర‌మే అని అధికారులు చెబుతున్నారు.. గ్రామ స‌చివాల‌యాలు క‌లెక్ట‌రేట్ ఆఫీసులో ఈ ప‌థ‌కం వివ‌రాల‌ను తెలియ‌చేస్తారు, అలాగే 1902 కి కాల్ చేసి మీకు రైతు భ‌రోసా రాక‌పోతే మీ స్టేట‌స్ తెలుసుకోవ‌చ్చు. రైతుల‌కి ఈ విష‌యాన్ని తెలియ‌చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియ‌చేయండి.