జియో బంపర్ ఆఫర్.. రూ.11,400 విలువైన ప్రొడక్ట్స్ ఉచితం

47

వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు అధికారికంగా ప్రారంభమయ్యాయి.సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సేవలను ఇవాళ ప్రారంభించారు. ఇక వాటికి గాను పూర్తి ప్లాన్ల వివరాలను కూడా జియో వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జియో ఫైబర్‌ సేవలను దేశవ్యాప్తంగా 1,600 నగరాల్లో ప్రారంభించింది. కనీసం 100 MBPS (మెగాబైట్స్‌ పర్ సెకన్‌) స్పీడు నుంచి గరిష్టంగా 1 GBPS (గిగాబైట్స్‌ పర్‌ సెకన్‌) స్పీడు వరకూ వివిధ రకాల ప్లాన్‌ లను అందుబాటులోకి తెచ్చింది. అన్‌ లిమిటెడ్‌ బ్రాండ్‌బాండ్‌ తో పాటు దేశంలో ఎక్కడికైనా ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ ద్వారా వీడియోకాలింగ్‌/కాన్ఫరెన్స్‌ సదుపాయం వంటి అనేక సేవలను వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

జియో గిగాఫైబర్ సేవలకు గాను వార్షిక ప్లాన్‌ను ఒకేసారి తీసుకునే వారికి Welcome Offer కింద రూ.5వేల విలువైన జియో హోం గేట్‌ వే, రూ.6400 విలువైన జియో 4కె సెట్ టాప్ బాక్స్‌ లను ఉచితంగా అందిస్తున్నారు. దీంతోపాటు 3 నెలల పాటు జియో సినిమా, జియో సావన్ యాప్‌ లకు, OTT యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

జియో గిగాఫైబర్ ప్లాన్లలో ఇండియాలో ఎక్కడికైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే అన్ని ప్లాన్లలోనూ ఏడాదికి రూ.1200 విలువ గల ఉచిత టీవీ వీడియో కాలింగ్‌ను, మరో రూ.1200 విలువైన గేమింగ్ సదుపాయాన్ని, హోం నెట్‌వర్కింగ్, డివైస్ సెక్యూరిటీ (5 డివైస్‌ లకు) సదుపాయాలను అందిస్తున్నారు. ఇక డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్లలో అదనంగా VR ఎక్స్‌పీరియెన్స్, ప్రీమియం కంటెంట్ (ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీలు, స్పెషల్ స్పోర్ట్స్ కంటెంట్)ను అందిస్తున్నారు.

మొత్తం ఆరు రకాల ప్లాన్‌లు
ఫైబర్‌ నెట్‌ సేవలకు మొత్తం ఆరు రకాల ప్లాన్‌లను రిలయన్స్‌ జియో ఆవిష్కరించింది. ఇందులో కనీస నెలవారీ చార్జీ(బ్రాంజ్‌ ప్లాన్‌) రూ.699 (స్పీడ్‌ 100MBPS ) కాగా, గరిష్టంగా రూ.8,499 (టైటానియం ప్లాన్‌-స్పీడ్‌ 1 GBPS )చార్జీ చేయనుంది. ఇంకా సిల్వర్‌ ప్లాన్‌ అయితే నెలకు రూ.849 (100 MBPS స్పీడ్‌); గోల్డ్‌ ప్లాన్‌కు రూ.1,299 (స్పీడ్‌ 250 MBPS; డైమండ్‌ ప్లాన్‌కు రూ.2,499 స్పీడ్‌ 500 MBPS; ప్లాటినం ప్లాన్‌కు రూ.3,999 స్పీడ్‌ 1 GBPS చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆరు ప్లాన్‌ లపైనా అదనంగా 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది.

ఏ ప్లాన్‌ తీసుకున్నా సేవలు పొందాలంటే ముందుగా (వన్‌ టైమ్‌) రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్‌, రూ.1,000 నాన్‌-రిఫండబుల్‌ Installation చార్జీల రూపంలో కంపెనీ వసూలు చేస్తుంది. కాగా, ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ FUP కింద డౌన్‌లోడ్‌ పరిమితిని గనుక దాటితే నెట్‌ స్పీడ్‌ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. బ్రాంజ్‌ ప్లాన్‌లో డౌన్‌ లోడ్‌ FUP పరిమితి 100 జీబీ కాగా, అదనంగా మరో 50 జీబీ(ప్రారంభ ఆఫర్‌ కింద 6 నెలలు మాత్రమే ఇస్తారు) లభిస్తుంది.

బ్రాంజ్‌ ప్లాన్‌ :
కస్టమర్లకు నెలకు 100జీబీ ఉచిత డేటా లభిస్తుంది. దీంతోపాటు లాంచింగ్ సందర్భంగా మరో 50 జీబీ డేటాను అదనంగా అందిస్తున్నారు. 100 MBPS స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. నెలకు ఈ ప్లాన్ కింద రూ.699 చెల్లించాలి.

సిల్వర్ ప్లాన్ :
సిల్వర్ ప్లాన్‌ లో 200 జీబీ నెలవారీ డేటా, 200 జీబీ అదనపు డేటా లభిస్తుంది. 100 MBPS స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. నెలకు ఈ ప్లాన్ కింద రూ.849 చెల్లించాలి.

గోల్డ్‌ ప్లాన్ :

గోల్డ్ ప్లాన్‌ లో 500జీబీ+250 జీబీ డేటా లభిస్తుంది. 250 MBPS స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. నెలకు ఈ ప్లాన్ కింద రూ.1299 చెల్లించాలి.

డైమండ్ ప్లాన్ :

1250 జీబీ + 250 జీబీ డేటా లభిస్తుంది. 250 MBPS స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. నెలకు ఈ ప్లాన్ కింద రూ.2499 చెల్లించాలి.

ప్లాటినం ప్లాన్ :
2500 జీబీ డేటా లభిస్తుంది. 1GBPS స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. నెలకు ఈ ప్లాన్ కింద రూ.3999 చెల్లించాలి.

టైటానియం ప్లాన్ :

5000 జీబీ నెలవారీ డేటా లభిస్తుంది.1 Gbps స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది.నెలకు ఈ ప్లాన్ కింద రూ. 8499 చెల్లించాలి. వీటితోపాటు 3, 6, 12 నెలల వాలిడిటీ ఉన్న ప్లాన్లను కూడా జియో గిగాఫైబర్‌ లో అందిస్తున్నారు. ఈ ప్లాన్లు అన్నింటిలోనూ ఇచ్చే డేటా అంతా అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 1 Mbps కు పడిపోతుంది. 30 రోజులు కాగానే బిల్ సైకిల్ మారి, స్పీడ్, డేటాలు యథావిధిగా లభిస్తాయి.

జియో ఫైబర్‌ నెట్‌ కనెక‌్షన్‌ తీసుకోవాలంటే ముందుగా www.jio.com వెబ్‌సైట్‌ ద్వారా లేదా My Jio యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకొని సంబంధిత వివరాలన్నీ ఇచ్చి రిజిస్టర్‌ చేసుకోవాలి. కస్టమర్‌ ఇచ్చిన అడ్రస్‌ పరిధిలో జియో ఫైబర్‌ అందుబాటులో ఉంటే.. సర్వీస్‌ ప్రతినిధులు సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటారు