నిరుద్యోగులకు శుభవార్త.. 10000 ఉద్యోగాలు

28

చ‌దువుకున్న విద్యార్దులు కాలేజీ నుంచి వంద మంది వ‌స్తే అందులో 5 లేదా 10 మందికి మాత్ర‌మే స‌రైన ఉద్యోగాలు వ‌స్తున్నాయి.. ఓ ప‌క్క కంపెనీల నుంచి ఉద్యోగుల‌కు గేట్లు బ‌య‌ట‌కు తెరుచుకుంటున్నాయి.. అందుకే ఉద్యోగాలు ప‌ర్మినెంట్ అనే మాట పోయింది.. ప్రైవేట్ కంపెనీల‌కు వేల‌ల్లో కాంపిటీష‌న్ ఉంటే, ప్ర‌భుత్వ కొలువుల‌కు ల‌క్ష‌ల్లో క్యూ ఉంది. అందుకే ఉద్యోగం అంటే భ‌య‌ప‌డిపోతున్నారు యువ‌త‌.. అయితే ప్ర‌యత్నం చేయాలి మ‌నం ప్ర‌య‌త్నం చేస్తేనే స‌క్సెస్ అవుతాం.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

మ‌రి చ‌దువుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి తీపికబురు వ‌చ్చింది. అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీ డీఎక్స్‌సీ టెక్నాలజీ ఈ ఏడాది ఏకంగా 10,000 మందికి పైగా అభ్యర్థులను నియమించుకోనుంది. డిజిటల్ టెక్నాలజీ నైపుణ్యాలు ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. వెంట‌నే డ‌వ‌ల‌ప్ అవ‌డం ఈ కంపెనీ టార్గెట్, అందుకే ఇతర కంపెనీలతో పోటీ కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

డీఎక్స్‌సీ టెక్నాలజీ కంపెనీకి భారత్‌లో ఏకంగా 45,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో ఇక 1,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో భారత్‌లోనే 40 శాతం మంది ఉన్నారు. ఇప్పుడు మరో 10,000 మందిని భారత్‌లో నియమించుకోవాలని చూస్తోంది. 10,000 మందిలో 1,500 మందిని క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో తీసుకుంటామని తెలిపింది.

భారత్‌లో ఉద్యోగులను నియమించుకుంటూనే ఉంటాం. ఈ ఏడాది (2019-20 ఆర్థిక సంవత్సరం) 10 వేలకు పైగా మందిని రిక్రూట్ చేసుకుంటాం. డిజిటల్ నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం’ అని డీఎక్స్‌సీ గ్లోబల్ హెడ్ (డెలివరీ అండ్ ఆపరేషన్స్) శాంసన్ డేవిడ్ తెలిపారు.

ఇకపోతే కంపెనీ అభ్యర్థుల కొరతతో సమస్యలు ఎదుర్కొంటోంది. అమెరికాలో టాలెంట్ ఉన్నవారు దొరకడం లేదు. దీంతో ఈ కంపెనీ వర్ధమాన దేశాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తీసుకోవడం ఆలస్యం కావడం వల్ల కంపెనీకి ఆదాయంలో 100 మిలియన్ డాలర్ల నష్టం కలిగిందని డీఎక్స్‌సీ టెక్నాలజీ సీఈవో జాన్ మైకెల్ నవంబర్‌లో తెలిపారు.

చూశారుగా కంపెనీ ఉద్యోగాలు క‌ల్పిస్తోంది, కాని డిజిట‌ల్ నైపుణ్యాలు ఉన్న అభ్య‌ర్దులు దొర‌క‌డం లేద‌ట, అందుకే ఆ కోర్సులు కూడా నేర్చుకుంటే ఈ ఉద్యోగం సంపాదించుకోవ‌చ్చు. మ‌రి డిజిట‌ల్ నైపుణ్యం సంపాదిస్తే ఈ ఉద్యోగం మీ సొంతం, ఈ జాబ్స్ గురించి మీ స‌న్నిహితుల‌కు కూడా తెలియ‌చేయండి.