YSR పథకానికి 15 కండిషన్లు తప్పనిసరి.. లేకుంటే మీకు ఈ పథకం వర్తించదు

53

రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా పది వేల రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీల అమలులో భాగంగా సొంతంగా ఆటో, క్యాబ్‌ నడుపుతూ జీవనం సాగించుకునేవారికి ఈ సాయం అందబోతోంది. లబ్ధిదారుల ఎంపిక, అర్హతకు సంబంధించిన మార్గదర్శకాలను రవాణాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సొంత ఆటో, ట్యాక్సీ ఉన్నవారు దరఖాస్తుతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌, తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు వివరాలతో మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

వాహన ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌ కోసం ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. దరఖాస్తుల పరిశీలన తర్వాత పదివేల రూపాయల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి జమ చేయనున్నట్లు పేర్కొంది. గతేడాది పాదయాత్రలో జగన్‌ను పలు ఆటో సంఘాల నేతలు కలిసి తమను ఆర్థికంగా ఆదుకోవాలని విన్నవించారు. ఆ సందర్భంగా జగన్‌ హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.400కోట్లు ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసం కేటాయించారు. ఈ పథకం కోసం అర్హులను గుర్తించాలని రవాణాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రవాణాశాఖ లెక్కల ప్రకారం ఆటోలు, ట్యాక్సీలు రాష్ట్రంలో 6.63 లక్షలున్నాయి. వాటిలో ఈ పథకానికి 60 శాతం మంది కూడా అర్హులు కాదని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. సొంత ఆటోలు కలిగిన వారి వివరాలతోపాటు ఆద్దె ఆటోల వారిని కూడా రవాణా శాఖ గుర్తించింది. ఒకటి కన్నా ఎక్కువ ఆటోలు కొనుగోలు చేసి అద్దెకిచ్చిన వారి వివరాలు కూడా ఆర్టీఏ అధికారులు సేకరించారు. కొన్నిరోజులుగా 13 జిల్లాల సమాచారం ప్రకారం సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడిపే వారు 3.97లక్షల మంది తేలారు. మొత్తం మీద ఈ సంఖ్య 59.87శాతమే ఉంది. అద్దెకు ఆటోలు తీసుకుని నడిపే వారి సంగతేంటని రవాణాశాఖ ఉన్నతాధికారుల ప్రస్తావించగా, ఆటో ఫిట్‌నెస్‌, ట్యాక్స్‌, ఇతర మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము అద్దె డ్రైవర్‌కు దక్కే అవకాశం లేదన్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు కలెక్టర్లకు పంపి పరిశీలన కోసం ఆయా గ్రామ, వార్డు వలంటీర్లను క్షేత్రస్థాయి విచారణకు పంపుతారు. సొంతంగా ఆటో ఉండి, తామే నడుపుతున్నవారిని గుర్తించి దరఖాస్తులను గ్రామాల్లో ఎంపీడీవోలకు, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లకు ఆ తర్వాత కలెక్టర్‌కు, చివరిగా రవాణాశాఖకు పంపుతారు. ఇన్ని ప్రక్రియలు దాటుకొని వచ్చే వారిని అర్హులుగా గుర్తించి ఈ నెలాఖరులోపు ఎంపిక పూర్తిచేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి రూ.10వేలు జమ చేస్తారు.

రవాణా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని జిల్లాల్లో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు..అర్హులైన డ్రైవర్లు తమ వాహనం, లైసెన్సుతో ఆధార్‌ను లింక్‌ చేసుకోవాలి. రవాణా శాఖ వెబ్‌సైట్‌ డేటాబేస్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి… 15 రోజుల్లోగా నిర్ధిష్టమైన (అన్‌ ఎన్‌కంబర్డ్‌) ఖాతాను తెరవాలి. అలాగే ఆటోకు సంబంధించిన అన్నిపత్రాలు కచ్చితంగా మీ దగ్గరే ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ కూడా ఆటో నడిపే వ్యక్తికి ఉండాలి.. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.