డ్వాక్రా మహిళలకు కొత్త రూల్స్ పెట్టిన జగన్ ఏంటో తెలుసా ?

79

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పొదుపు సంఘాల మహిళల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన 1020 కోట్ల రుపాయలను అక్టోబర్ 2 వ తేదీ లోపు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ నెల వరకు మహిళల అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలను బ్యాంకులలో జమ చేయనున్నారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఏ డ్వాక్రా సంఘానికి ఎంత మొత్తంలో ప్రభుత్వం జీరో వడ్డీ కింద చెల్లించారో ఆ రశీదులను వాలంటీర్లు డ్వాక్రా మహిళలకు అందజేస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 11 వ తేదీ వరకు ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలను నాలుగు విడతలుగా వచ్చే ఏడాది నుండి ప్రభుత్వం అందించబోతుంది. బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించేలా సున్నా వడ్డీలకే రుణాల విప్లవం తీసుకురాబోతుంది వైసీపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఐదు నెలల వడ్డీని అక్టోబర్ 2 వ తేదీ లోపు బ్యాంకులలో జమ చేయనుంది.

బ్యాంకర్ల సంఘాలు ఇచ్చిన వివరాల ప్రకారం 27,168 కోట్ల రుపాయలు ఏప్రిల్ 11 వ తేదీ నాటికి బ్యాంకుల్లో పొదుపు సంఘాల అప్పులుగా ఉన్నాయి. మెప్మా మరియు సెర్ఫ్ అధికారులు రాష్ట్రం అంతా డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశాలను నిర్వహించి, డ్వాక్రా సంఘాలకు ఉన్న అప్పులను తీర్మానం చేయించి బ్యాంకు అధికారుల ద్వారా ఆ వివరాలను సర్టిఫై చేయిస్తున్నారు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా ఈ సమావేశాల నిర్వహణ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక నాలుగు విడ‌త‌లుగా డ‌బ్బులు చెల్లించ‌నుంది ప్ర‌భుత్వం.

ఇక 58 సంవ‌త్స‌రాలు ఉన్న డ్వాక్రా మ‌హిళ‌ల‌కు గ్రూపులో స‌భ్య‌త్వం కల్పించ‌రు అని తెలుస్తోంది.. అలాగే 58 ఏళ్లు పైబ‌డిన వారికి లోన్స్ ఇవ్వ‌రు అని తెలుస్తోంది, ఇక ఏజ్ బార్ అవ‌డం స‌రిగ్గా కొంద‌రు పే చేయ‌డం లేదు అని చెబుతున్నారు. మీరు తీసుకున్న రుణం ల‌క్ష రూపాయ‌లు అయితే అది నాలుగు విడ‌త‌లుగా ఇస్తారు. అంటే 25 వేల రూపాయ‌ల చొప్పున ఇవ్వ‌డం జ‌రుగుతుంది… అంతేకాదు వారికి నేరుగా క్యాష్ ఇవ్వ‌డం జ‌రుగుతుంది పాత బాకీల కింద బ్యాంకులు జ‌మ చేయ‌కూడ‌దు. మ‌రి ఇది కొత్త అప్ డేట్ న్యూస్, జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.