అగ్రిగోల్ద్ బాధితులకు జగన్ సంచలన ప్రకటన.. షాక్ లో ప్రజలు

44

ల‌క్ష‌లాది మందిని క‌న్నీరు పెట్టించిన స్కీమ్ ఏమైనా ఉంది అంటే అది అగ్రీగోల్డ్ అనే చెప్పాలి. వేల కోట్ల రూపాయ‌ల స్కామ్ అలా మూల‌న ప‌డేశారు డిపాజిట్ చేసిన వారికి మాత్రం సొమ్ములు అంద‌లేదు., తాము సంపాదించి కూడగట్టుకున్న సొమ్ముని అగ్రిగోల్డ్ అనే పథకం తినేసిందని కన్నీరు పెట్టుకున్నారు, చివ‌ర‌కు త‌మ డ‌బ్బు వ‌స్తుందో రాదో అని త‌నువు చాలించారు ఎందరో అమాయ‌కులు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

చాలా కుటుంబాల్లో ఈ స్కామ్ విషాదం నింపింది. ఏజెంట్లు కూడా కస్టమర్ల నుంచి వచ్చిన ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. డిపాజిట్ దారులు ఆందోళనలు చేశారు.. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి కన్నీరు పెట్టారు… ఆక్రోశం వెల్లిబుచ్చారు.. పిల్లల చదువులు పెళ్లిళ్లు కూడా ఆ డిపాజిట్ల తో ముడిపడి ఉన్నాయి , దేశంలో అతి పెద్ద స్కామ్ గా దీనిని చెప్పవచ్చు, ఎందుకంటే డబ్బు తక్కువ అయినా లక్షలాది మంది డిపాజిట్ దారులు ఇందులో ముడిపడి ఉన్నారు… వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సరే గత పాలకు ఐదు సంవత్సరాల సమయంలో అగ్రిగోల్డ్ బాధితులకు సాయం చేయలేకపోయారు. వారిని ఆదుకున్న పాపన పోలేదు, ఏకంగా అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాహ చేయడానికి కొందరు కుట్రలు కూడా పన్నారు .. కాని వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సమయంలో అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు హమీ ఇచ్చారు,

తాజాగా అగ్రిగోల్డ్‌ బాధితులకు వెంటనే సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం, బాధితులు, సీఐడీ అధికారులతో త్వరలోనే సమావేశం అవుతానని వెల్లడించారు. 1150 కోట్ల రూపాయలు త్వరితగతిన బాధితులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తుల స్వాధీన ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అదే విధంగా ఈ కంపెనీకి సంబంధించిన విలువైన ఆస్తులపైనా దృష్టి సారించాలని తెలియచేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్ల రూపాయల కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుంది, ఈ చెల్లింపుల్లో జాప్యం జరగకూడదని సూచించారు. సెప్టెంబర్ నుంచి ప్రతినెలా చెల్లింపులు చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శికి ఆదేశాలిచ్చారు. మిగిలిన సొమ్మును కూడా త్వరలోనే చెల్లిస్తామన్నారు. సీఐడీ నుంచి బాధితుల జాబితా తీసుకుని.. గ్రామ వలంటీర్ల ద్వారా బాధితులకు రశీదులు అందజేయాలని సూచించారు. తాజాగా గ్రామ వ‌లంటీర్లు అగ్రిగోల్డ్ డిపాజిట్ దారుల నుంచి స‌మాచారం కూడా తీసుకుంటున్నారు అని తెలుస్తోంది.