గజల్ శ్రీనివాస్ గురించి పచ్చి నిజాలు బయటపెట్టిన బాధితురాలు

0
141

ఆధ్యాత్మిక, దేశభక్తి, మహిళల భద్రత.. ఇలా ఎన్నో అంశాలపై గజల్స్‌ రాసి ఆలపిస్తున్న కేసిరాజు శ్రీనివాస్‌ అలియాస్‌ గజల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంస్థలోని ఉద్యోగినినే వేధించి అడ్డంగా బుక్కయ్యాడు.బాధితురాలు పక్కా సాక్ష్యాలతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం బయటపడింది. ఆయ‌న‌కు సంబంధించిన రేడియో సంస్థ‌లో జాకీగా ప‌నిచేస్తున్న అమ్మాయిపై శ్రీనివాస్ వేధింపులు శృతిమించాయి.

ఈ క్రింది వీడియో చూడండి.

అయితే ఆ అమ్మాయి మొద‌ట‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించింది. అయితే పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, కేవలం ఫిర్యాదు మాత్రమే చేస్తే ఎవరూ నమ్మరనే ఉద్దేశంతో స్వయంగా ఆమె స్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. సేవ్‌ టెంపుల్‌ కార్యాలయంలో శ్రీనివాస్‌ వినియోగిస్తున్న బెడ్‌రూమ్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో గజల్‌ శ్రీనివాస్ రాసలీలలతోపాటు బాధితురాలు ఆయ‌న కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. గత శుక్రవారం ఈ వీడియో ఆధారాల‌తో పంజగుట్ట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. వీడియో రికార్డులతోపాటు వాయిస్‌ రికార్డులు, ఫొటోలు పోలీసులకు అందించింది. దీంతో ఐపీసీ 354, 354 (ఏ), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విషయం గోప్యంగా ఉంచి ప్రాథమిక దర్యాప్తు చేశారు.

Image result for ghazal srinivas
అన్ని ఆధారాలు సేకరించి మంగళవారం ఉదయం ఆనంద్‌నగర్‌ కాలనీలోని తన నివాసంలో గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ‌
అనంతరం గజల్‌ శ్రీనివాస్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన్ను రెండు వారాల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రెండు పిటిషన్లపై వాదనలను విన్న న్యాయస్థానం.. శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో పార్వతిని రెండో నిందితురాలిగా చేర్చామని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. . ఈ కేసులో పార్వతి అనే మహిళను కూడా నిందితురాలిగా చేర్చినట్టు ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రవీందర్‌ మంగళవారం వెల్లడించారు.

Image result for ghazal srinivas

కరీంనగర్‌కు చెందిన బాధిత మహిళ బీకాం, బ్యూటీషియన్‌ కోర్సులు పూర్తి చేయడంతో పాటు ప్రవచనాలు, వేదాలు అధ్యయనం చేసింది. ఈమెకు 2014లో వివాహమైనా మూడు నెలలకే విడాకులు తీసుకుంది. గతేడాది జూన్‌ నుంచి పంజగుట్ట పరిధిలోని సప్తగిరి బిల్డింగ్‌లో ఉన్న సేవ్‌ టెంపుల్‌ సంస్థలో నెలకు రూ.13 వేల జీతానికి పని చేస్తోంది. ఆ సంస్థ నిర్వహించే వెబ్‌ రేడియో ఆలయవాణికి ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వర్తిస్తోంది. వెలగపూడి ప్రకాశ్‌రావు నేతృత్వంలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మూడేళ్లుగా సప్తగిరి బిల్డింగ్‌లోని త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌లో నడుస్తోంది. ఈ సంస్థకు గజల్‌ శ్రీనివాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి బాధితురాలు ఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకే విధులు నిర్వర్తించాల్సి ఉంది. అయితే గజల్‌ శ్రీనివాస్‌ తరచూ ఆ కార్యాలయానికి వెళ్లి అర్ధరాత్రి వరకు గడిపేవాడు. బాధితురాలిని కూడా ఆ సమయం వరకు ఉండాల్సిందిగా ఒత్తిడి చేసేవాడు.

Image result for ghazal srinivas

కార్యాలయానికి సంబంధించిన మూడు బెడ్‌రూమ్స్‌లో ఒకదాన్ని గజల్‌ శ్రీనివాస్‌ తన అనైతిక కార్యకలాపాలకు వినియోగించేవాడు. వేళకాని వేళల్లో పని మనిషి పార్వతితో కాళ్లు నొక్కించుకోవడం, మసాజ్‌ చేయించుకోవడంతోపాటు ఇతర అనైతిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. తనకు సహకరించాలంటూశ్రీనివాస్‌ బాధితురాలిపై ఒత్తిడి చేసేవాడు. లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తానని, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడంతోపాటు మరెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించేవాడు. పార్వతి సైతం గజల్‌ శ్రీనివాస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ బాధితురాలిపై అనేకసార్లు ఒత్తిడి తీసుకువచ్చింది. ఆయన చాలా పెద్దోడు. నాకు చేసినట్లే నీకు పెళ్లి కూడా చేస్తాడు అని చెప్పేది. ఈ వేధింపులు తారస్థాయికి చేయడంతో అనేకసార్లు తిరస్కరించిన బాధితురాలు.. కొన్ని సందర్భాల్లో పార్వతితో కలిసి రెండుమూడు గంటల పాటు గజల్‌ శ్రీనివాస్‌ కాళ్లు నొక్కేది. ఆమెను బలవంతంగా ఆలింగనం చేసుకోవడం, చేతులతో అభ్యంతరకరంగా తడమటం చేసేవాడు.

Image result for ghazal srinivas

బాధితురాలి ఫిర్యాదు మేరకు వారి కార్యాలయంలో కూడా విచారించి, వీడియోలు, ఆడియోలు, ఫోటోలు అన్ని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏ–1గా శ్రీనివాస్, ఏ–2గా పనిమనిషి పార్వతిని చేర్చినట్లు తెలిపారు. శ్రీనివాస్‌ గత రెండ్రోజులుగా నగరంలో లేడని, మంగళవారం ఉదయం వచ్చినట్టు తెలియగానే అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే గ‌జ‌ల్ శ్రీనివాస్ వాద‌న మాత్రం మ‌రోలా ఉంది. గతంలో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో నా చేతికి గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా. ఆ రోజు ఫిజియోథెరపిస్ట్‌ రాలేదు. దీంతో తనకు అనుభవం ఉందని, తానే చేస్తానంటూ ఆమె ముందుకు వచ్చింది. నేను వద్దని వారించినా ఫిజియోథెరపీ చేసింది. ఇప్పుడు ఇలా ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదున్నారు మీడియాతో గజల్‌ శ్రీనివాస్ చెప్పాడు.

Image result for ghazal srinivas

ఇక బాధితురాలు మాట్లాడుతూ. గ‌జ‌ల్ శ్రీనివాస్ మోసగాడు.. పెద్ద మనిషి ముసుగు వేసుకుని ఉన్న పచ్చి మోసగాడు. ఆయన లైంగిక వేధింపులను పలుమార్లు సంస్థ నిర్వాహకులతో పాటు ఆయన కుటుంబ సభ్యుల దృష్టికి కూడా తీసుకువెళ్లా. వారెవరూ పట్టించుకోకపోవడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశా. శ్రీనివాస్‌ కోరినట్లు ఉండాలంటూ పార్వతి నాపై అనేకసార్లు ఒత్తిడి చేసింది. ఆమె కూడా మంచిది కాదు. రెండు నెలలుగా నాపై వేధింపులు పెరిగాయి అని తెలిపింది.

వాటా