ఆయన ఎప్పుడు అలానే చేసుకొనేవాడు…నాతో చేసేవాడు కాదు గ‌జ‌ల్ శ్రీనివాస్ గురించి పచ్చినిజాలు బయటపెట్టిన భార్య..

0
3478

గజల్ శ్రీనివాస్.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన వ్యక్తి. అయితే త‌న సంస్థ‌లో ప‌నిచేసే అమ్మాయిని లైంగికంగా వేధించి అడ్డంగా దొరికిపోయాడు..లైంగిక వేధింపుల కేసులో ఆయ‌న‌ను అరెస్ట్ చేసి న పోలీసులు చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు. గ‌జ‌ల్ శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తున్న వీడియోల‌ను పోలీసుల‌కు ఆధారాల‌తో స‌హా అందించి ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా వేధింపులు నిజ‌మేన‌ని తేలిపోయింది.

ఈ క్రింది వీడియో చూడండి.

దీంతో గ‌జ‌ల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. త‌న గ‌జల్స్ తో ఎంతో పేరు సంపాదించుకున్న గ‌జ‌ల్ శ్రీనివాస్ , ఈ వ్య‌వ‌హారంతో అది అంతా పొగోట్టుకున్న‌డు. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఛీ కొడుతున్నారు. బాధితుల‌తో ఆయ‌న మ‌సాజ్ చేయించుకోవ‌డం, కాళ్లు నోక్కించుకోవ‌డం వీడియోల్లో స్ప‌ష్టంగా క‌నిపించాయి. ఆయ‌న‌తో పాటు ఈ కేసులో ప‌నిమ‌నిషి పార్వ‌తిని కూడా నిందితురాలిగా చేర్చారు పోలీసులు. ప్ర‌స్తుతం ఆమె ప‌రాలీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Image result for gajal srinivas wife

ప‌నిమ‌నిషి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్న పోలీసులు, ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దంచేస్తున్నారు. ఇక గ‌జ‌ల్ శ్రీనివాస్ రాస‌లీల‌ల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి బాధితురాలు ప‌క్కా ప్లాన్ గా కెమెరాలు పెట్టింది. ఈ వీడియోలో ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. గ‌జ‌ల్ శ్రీనివాస్ పెద్ద ఫ్రాడ్ అని బాధిరాలు ఆరోపిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు పెద్దమనిషిగా, ఆధ్యాత్మికవేత్తగా చెలామణి అవుతాడు.

Image result for gajal srinivas wife

ఎవరూ లేనప్పుడు అతడిలోని రాక్షసుడు నిద్ర లేచి వేధింపులు ప్రారంభిస్తాడని బాధితురాలు చెబుతోంది. ఆ కార్యాలయంలో పని చేసినన్నాళ్ళూ ఒక్కో క్షణం ఒక్కో నరకం అనుభవించా అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సేవ్‌ టెంపుల్‌ సంస్థ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు స్ఫూర్తి పొందే జీతంలో పెరుగుదల లేకపోయినా పాత ఉద్యోగం మాని అక్కడ చేరాలని భావించాన‌ని బాధితురాలు క‌న్నీళ్లు పెట్టుకుంది.

Image result for gajal srinivas wife

సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న గ‌జ‌ల్ శ్రీనివాస్ ను త‌ప్పించింది ఆ సంస్థ‌. పక్కా ఆధారాల కోసమే నేను ఈ మధ్య ఆయన పిలిచినప్పుడు గదిలోకి వెళ్ళి కాళ్ళు నొక్కడం, ముట్టుకోవడం చేశా. ఇదంతా కెమెరాలో రికార్డు అవుతుందనే చేశా. పోలీసుల వద్దకు వెళ్ళేప్పుడు భయపడ్డా. అయితే ఏసీపీ విజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ నాకు ధైర్యం చెప్పారు. నేను చేసిన సాహసానికి న్యాయం చేస్తూ గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. వారితోపాటు తెలంగాణ పోలీసుకి ఎంతో రుణపడి ఉన్నా. సాధారణంగా ఓ ఆడపిల్ల తనకు ఎదురైన లైంగిక వేధింపుల్ని మౌనంగా భరిస్తుంది తప్ప బయటకు చెప్పుకోలేదు. తెగించి అలా చెప్పిందంటే అవి శృతిమించాయని, నిజమని నమ్మాల్సిందే. నేను ఇన్ని ఆధారాలు, వీడియోలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా కొందరు అనుమానిస్తున్నారు.

Related image

ఇక గ‌జ‌ల్ శ్రీనివాస్ పై ఆయ‌న భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌నకు మ‌హిళ‌ల మీద ఎక్కువ మోజు ఉండేద‌ని స‌న్నిహితుల ద‌గ్గ‌ర వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం. త‌న‌తో కూడా మసాజ్ చేయించుకునేవాడ‌ని, అయితే ఇలా అమ్మాయిల‌ను వేధిస్తాడ‌ని అనుకోలేద‌ని ఆమె అన్న‌ట్లు తెలుస్తోంది. త‌న ద‌గ్గ‌ర బాగానే ఉంటాడ‌ని, మ‌రి ఏందుకు ఇలా ప్ర‌వ‌ర్తించాడో త‌న‌కు కూడా అర్థం కావ‌డం లేద‌ని గ‌జ‌ల్ శ్రీనివాస్ భార్య తెలిపిన‌ట్లు తెలుస్తోంది. మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధించ‌డం త‌ప్పేనన్న ఆమె, క‌ఠినంగా శిక్షించాల‌ని బంధువుల ద‌గ్గ‌ర వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది.

వాటా