ధనస్సు రాశికి చెందిన వారు చమంచాయ రంగులో ఉంటారు. ప్రతిఒక్కరూ వీరంటే ఇష్టపడతారు. రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం బాగుంటుంది. ఈ రాశి వారు అందరినీ కలుపుకు పోతారు.
మూల 1,2,3,4 పాదములు, పుర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుస్సు రాశికి చెందినవారు .
శ్రీ విళంబి నామ సంవత్సరం లో ఆదాయం: 5, వ్యయం: 5; రాజపూజ్యం: 1, అవమానం: 5
వ్యాపారం
ఈ రాశి వారికీ వ్యాపారం రంగంమీద ఆసక్తిలేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించటంవల్ల ఈ రాశి వారికి లాభాలను తెచ్చిపెడతాయి. దానితో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది. చేపట్టిన పనిమీద ఆసక్తి చూపించటంవల్ల విజయాలకు తిరుగే ఉండదు.
ఆర్థిక స్థితి
చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతుండటంవల్ల ఆర్ధికస్థితి మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు రాశి వారు ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి, విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి.
వృత్తి, జీవిత గమనం
చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు.అక్టోబర్ నుంచి టెక్స్టైల్స్, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. విదేశీ గమనానికి, విదేశాలలో చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
ప్రేమ సంబంధాలు
ప్రేమించిన వారి ప్రేమకోసం ఏమి చెయ్యటానికైనా వెనుకాడరు. ప్రేమికులను కలపటానికి కృషి చేస్తుంటారు. బంధువులతో ఆప్యాయంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.కొత్త వారిని తొందరగా నమ్మకూడదు ఎందుకంటే ఈ ఏడు కొత్త వారి స్నేహం కారణంగా నష్టం జరుగుతుంది.
అలవాట్లు
ధనస్సు రాశికి చెందిన వారు పక్కవారికి ఆదర్శవంతంగా ఉంటారు. అందరికీ సహాయం చెయ్యాలన్న తపన వీరికున్న ప్రత్యేక లక్షణం. మంచి చెడులను గూర్చి వీరు నేర్చుకుంటూనే ఉంటారు.
దాంపత్య జీవితం
వీరి జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులు. వారి ఆశయాలను సఫలీకృతం చేయటానికి వీరు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది. అదేవిదంగా సంతానం విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది.
బలహీనతలు
ధనస్సు రాశివారు ఉద్రేక స్వభావులుగా ఉండి ఎదుటి వ్యక్తి చెపుతున్న మాటలను పట్టించుకోకపోవటమనే పెద్ద బలహీనతతో ఉంటారు. మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. బదిలీ కోసం మీరు చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి.
అదృష్ట రత్నం
వైఢూర్యం, వజ్రం, కెంపు రాళ్లలో ఏదో ఒక దానిని ఈ రాశి వారు ధరించాల్సి ఉంటుంది.
వ్యక్తిత్వం
ఉన్నత వ్యక్తిత్వం గలవారై ఉంటారు. జీవితంలో ఎప్పుడూ నిజాయితీతో ముందుకు సాగాలన్న ధ్యేయంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వాన్ని చూసి ఇతరులు వేయనోళ్ల పొగుడుతారు. స్పష్టమైన వైఖరి కలిగిన ఈ రాశి వారు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు తరచి తరచి ఆలోచిస్తారు.
ఆరోగ్యం
మార్చి 10 నుంచి జూలై 10 మధ్య పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. 1వ స్థానంలో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అన్ని పనుల్లో అటంకాలు ఎదురవుతాయి.అలాగే షుగర్ సమస్య వీరిని బాధిస్తుంది. 8-2 స్థానాల్లో రాహు, కేతువుల సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
ఇల్లు-కుటుంబం
ఇల్లు, పిల్లలు, జీవిత భాగస్వామి అన్నా వీరికి ఎనలేని అనురాగం. పిల్లలతో ఆటపాటలతో గడపటానికి ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.మార్చి 10 నుంచి జూలై 10 మధ్య పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది.దీర్ఘకాలిక దృష్టితో చేసే పెట్టుబడులు కొంతవరకు లాభిస్తాయి.బందువులందరి దృష్టి లోను కూడా మంచి వాళ్ళు గా మిగిలిపోతారు.
కలిసివచ్చే రోజు
ఈ రాశి వారికీ ఆది, బుధ, గురు, శుక్రవారాలు కలిసి వచ్చే రోజులు. ఆ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి
అదృష్ట సంఖ్య
ధనస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. అదేవిధంగా 12, 21, 30, …సంఖ్యలు కూడా కలిసి వచ్చే సంఖ్యలే.
అదృష్ట రంగు
ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రంగు దుస్తులను ధరించిన రోజున విజయం తప్పక వీరిదే అవుతుంది..
పరిష్కారం :
ఈ రాశి వారు శుక్ర వారం తప్పక లక్ష్మి అమ్మవారిని మందార పువ్వులతో తప్పక పూజించాలి.