BSNL సంచలనం.. కేవలం 499రూ.కే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే మతిపోతుంది

0
299

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సంచలన ప్రకటన చేసింది. కేవలం రూ. 499 రూపాయలకే అతి తక్కువ ధరకే ఫీచర్‌ ఫోన్‌ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ల్‌ మనోజ్‌ శర్మ జైపూర్‌లో ఈ ఫోన్ ను లాంచ్‌ చేశారు. డీ టెల్‌ డీ 1 పేరుతో దీని అసలు ధర 346 రూపాయ‌లు.

ఈ క్రింది వీడియో చూడండి.

అయితే ఈ ఫీచర్‌ ఫోన్‌తో అందిస్తున్న తారిఫ్‌ ప్లాన్‌తో కలిపి ఈ ఫోన్‌ ధరను 499 రూపాయ‌లుగ‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది. డీటెల్ డీ1 పేరితో ఈ నూతన ఫీచర్ ఫోన్‌ను మార్కెట్ లోకి ప్ర‌వేశ‌పెట్టింది. డీటెల్ సంస్థతో భాగస్వామ్యమైన బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఫోన్‌ను త‌యారుచేసింది.

Image result for bsnl

ఈ ఫోన్‌తోపాటు రూ.153 టారిఫ్ ప్లాన్‌ను కూడా అందిస్తామ‌ని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రూ.103 టాక్‌టైం లభిస్తుంది.అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ టు బీఎస్‌ఎన్‌ఎల్ కాల్స్‌కు నిమిషానికి 15 పైసలు చార్జి చేస్తారు.

Image result for bsnl detel mobile
అలాగే ఇతర ఆపరేటర్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసలు చార్జి పడుతుంది. ఇక ఈ ప్లాన్‌కు వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు. దీంతో సంవత్సరం పాటు ఈ ప్లాన్‌ను వాడుకోవచ్చు. ఈ ఫోన్‌లో 1.44 ఇంచ్ మోనోక్రోమ్ డిస్‌ప్లే, ఫిజికల్ కీప్యాడ్, సింగిల్ సిమ్ స్లాట్, 650 ఎంఏహెచ్ బ్యాటరీ, టార్చి లైట్, ఫోన్‌బుక్, ఎఫ్‌ఎం రేడియో, లౌడ్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Image result for bsnl detel mobile

 

వినియోగ‌దారుల‌కు అతి త‌క్కువ ధ‌ర‌తో ఫోన్ ను అందించేందుకు ఈ ఫోన్ ను విడుద‌ల చేసిన‌ట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది. వినియోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌కే ఫోన్ తో పాటు, టాక్ టామ్ దీని ద్వారా ల‌భించ‌నుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ అఫీషియల్‌ లింక్‌లో దీన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు.

Image result for bsnl detel mobile

అలాగే మరో ఆఫర్‌ కూడా ఉంది. డీ టెల్‌ డీ 1 కొనుగోలుతో రూ.153 టాక్‌ టైం. ఒక సంవత్సరం వాలిడిటీ. అయితే దీంట్లో ఎలాంటా డేటా సేవలుఅందుబాటులో లేవు.రిటైల్ గ్రామీణ ప్రాంత ప్రజలకు మొబైల్ ఫోన్, మొబైల్ సర్వీసులు , ముఖ్యంగా వాయిస్‌ కాలింగ్‌ సేవలు అందించేందుకు డీటె ల్ డి 1 చాలా ఉపయోపడుతుందని బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘సబ్‌ కా సాత్ సబ్‌కా వికాస్’ పథకంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఫోన్‌ బుక్‌, లౌడ్‌ స్పీకర్‌, టార్చ్‌ లైట్‌ తదితర ఫీచర్లు ఇందులో పొందుపర్చినట్టు పేర్కొంది.

వాటా