Breaking News: హీరో కార్తీ ఇంట్లో విషాదం.. అసలేమైంది?

0
296

హీరో కార్తీ. త‌మిళ అగ్ర న‌టుడు సూర్య త‌మ్ముడుగా, హీరోగా అంద‌రికీ సుప‌రిచ‌య‌మే. అటు తమిళంతో పాటు, ఇటు తెలుగు లోనూ సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించాడు. తెలుగులో కూడా కార్తీ ఎంతోమంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడంటే ఆయ‌న న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Related image

త‌న స‌హాజ న‌ట‌న‌తో మ‌న ప‌క్కింటి అబ్బాయిలా క‌నిపిస్తాడు కార్తీ. సినిమాల్లోనే కాదు,బ‌య‌ట కూడా ఆయ‌న చాలా సింపుల్ గా ఉంటార‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే అలాంటి కార్తీ ఒక్కసారిగా భోరున ఏడ్చేశాడు. ఇంతకూ కార్తీ ఇలా ఏడవడానికి కారణం ఏమిటో తెలుసా..? .హీరోల‌కు ప్రేమించే అభిమానులు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్నారు.

Image result for karthi

అయితే అభిమానుల‌ను ప్రేమించి, సొంత కుటుంబంలా చూసుకునే హీరోలు చాలా కొద్దిమందే ఉంటారు. హీరో మ‌ర‌ణింస్తే బాధ‌ప‌డే అభిమానులు ఉంటారు. అయితే అభిమానిని చ‌నిపోతే ఏడ్చే హీరోలు చాలా త‌క్కువ మందే ఉంటారు.తాజాగా కార్తీక్ ఏడ్చిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇంత‌కు కార్తీక్ ఏడ‌వ‌డానికి కార‌ణం ఎంటో తెలుసా.. ఎందుకో తెలిస్తే ఆయ‌న త‌న అభిమానుల‌ను ఎంత‌గా ప్రేమిస్తారో తెలుస్తోంది. కార్తీ ఏడ‌వ‌డానికి కార‌ణం అతడి అభిమాని మరణించడమే..!

Image result for karthi

.అభిమానులంటే విలువ ఇచ్చే హీరోలు ఇలా చాలా.. చాలా.. అరుదుగా ఉంటారు.కార్తీ తన అభిమాని మరణాన్ని తట్టుకోలేక భోరున ఏడ్చేశాడు. త‌మిళ‌నాడులోని తిరువ‌ణ్నామ‌లైకు చెందిన జీవన్, కార్తీకి వీరాభిమాని. తిరువ‌ణ్నామ‌లై జిల్లా కార్తీ అభిమాన సంఘానికి జీవ‌న్ అధ్యక్షుడు కూడా. వ్య‌క్తిగ‌తంగా కూడా అత‌ను, కార్తీకి చాలా చేర‌వ‌య్యాడు. మూడు నెల‌ల‌ కింద‌ట జ‌రిగిన జీవన్ పెళ్లికి కూడా కార్తీ హాజ‌రయై దీవించాడు.కార్తీని జీవన్ కుమార్ చాలా సార్లు కలిశాడట.. ఎంతో ఆప్యాయంగా తన అభిమానితో సినిమా ముచ్చట్ల గురించే చర్చించేవాడు కార్తీ..

Image result for karthi

అయితే పెళ్లి జ‌రిగి మూడు నెల‌లు కూడా గ‌డ‌వ‌క ముందే జీవన్ మ‌ర‌ణించాడు. కారు ప్ర‌మాదానికి గురై అత‌ను మ‌ర‌ణించాడు. ఈ ప్ర‌మాదంలో ఆ కారులోనే ఉన్న ముగ్గురు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. త‌న‌ను అమితంగా అభిమానించే జీవన్ మ‌ర‌ణం కార్తిని తీవ్రంగా క‌లిచివేసింది. ఈ విష‌యం తెలిసిన కార్తీ వెంట‌నే అక్క‌డికి చేరుకుని నివాళులు అర్పించాడు.ఈ సంద‌ర్బంగా ఒక్క‌సారిగా ఉద్వేగానికి గురైన కార్తీ తీవ్రంగా విల‌పించాడు. జీవన్ కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చ‌డానికి వ‌చ్చిన కార్తీ అంత‌లా ఏడ‌వ‌డం చాలా మందిని క‌లిచివేసింది.అక్క‌డున్న వారంద‌రినీ చూసి క‌న్నీళ్ల పెట్టుకున్నాడు.వీరాభిమాని దూరమవడంతో కార్తీ ఇలా బాధలో ఉండిపోయాడు. జీవ‌న్ వ‌య‌స్సు 27 సంవత్సరాలు. పెళ్లి అయి మూడు నెల‌లు కాక‌ముందే రోడ్డ ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో అతడి కుటుంబం బాధలో ఉండిపోయింది. జీవన్ తో పాటు అతడి స్నేహితుడు దినేష్ కూడా చనిపోయాడు. అలాగే ఇంకో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అభిమానికి కోసం ఇలా కార్తీ ఏడ‌వ‌డం ఆయ‌న అభిమానుల‌ను క‌ల‌చివేసింది.

వాటా