షూటింగ్ స్పాట్ కు తాగి వచ్చి టాప్ హీరోయిన్ ను చితకబాదిన తాగుబోతు భర్త ఎవరో తెలుసా?

0
245

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోల పోటీని త‌ట్టుకొని ఎంతోమంది హీరోయిన్లు త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, నాగేశ్వ‌ర‌రావు సినిమా ఇండ‌స్ట్రీకి రెండు క‌ళ్లు లాంటి వార‌ని అంటూ ఉంటారు . అప్ప‌ట్లో సినిమా ఇండ‌స్ట్రీని ఈ ఇద్ద‌రు అంత‌గా ఏరారు. అయితే వారి స‌రస‌న న‌టించిన హీరోయిన్లు కూడా పోటీకి ధీటుగా అభిమానుల‌ను సంపాదించుకొని మంచి గుర్తింపు పొందారు.

ఈ క్రింది వీడియో చూడండి.

అల‌నాటి పాత‌త‌రం హీరోయిన్ల‌లో ముందుగా అంద‌రికి గుర్తుకొచ్చేది సావిత్రి. ఇక ఈ త‌ర్వాత జ‌మున‌, అంజ‌లీదేవి పేర్లు వినిపిస్తున్నాయి. హీరోల పోటీని ఎదుర్కొని ఈ హీరోయిన్లు తెలుగు ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకున్నారు. చిర‌స్థాయిగా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నాటుకుపోయారు .అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్లు గా వీరు క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ల పోటీని త‌ట్టుకొని వారికి ధీటుగా పేరు సంపాదించుకున్న హీరోయిన్ ఎవ‌రంటే శార‌ద‌.

Image result for sarada heroine

శార‌ద స్వ‌స్థ‌లం గుంటూరు జిల్లాలోని తెనాలి. ఆమె అస‌లు పేరు మాత్ర స‌ర‌స్వ‌తి దేవి. అయితే సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన త‌ర్వాత ఆమె పేరు మార్చుకుంది. చిన్న‌త‌నంలోనే భ‌ర‌త‌నాట్యం నేర్చుకున్న ఆమె, 14 ఏళ్ల వ‌య‌స్సులోనే నాట‌కాల్లో న‌టించ‌డం ప్రారంభించింది. అప్ప‌ట్లో నాట‌కాల్లో న‌టించేవారిని త‌క్కువ‌గా చూసేవారు. ఈ కార‌ణంలో శార‌ద కుటుంబాన్ని బంధువులంద‌రూ బ‌య‌టికి పంపించార‌ట‌.

Image result for sarada heroine

క‌న్యాశుల్కం సినిమాతో హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో హ‌స్య‌న‌టిగా కూడా న‌టించింది. అయితే బ‌లిపీఠం సినిమా ఆమె స్టార్ డ‌మ్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ త‌ర్వాత శార‌ద వెనుతిరిగి చూసుకోలేదు. వ‌రుస సినిమాల్లో న‌టించి తెలుగువారి మ‌న‌స్సులో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. అప్ప‌ట్లో స్టార్ హీరోల‌కు ధీటుగా పేరు, ప్ర‌ఖ్యాత‌లు సొంతం చేసుకుంది.

Image result for sarada heroine

అయితే శారద సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఆమె తండ్రికి న‌చ్చేది కాద‌ట‌. కానీ, ఆమె త‌ల్లి మాత్రం బాగా ప్రోత్స‌హించేది. శార‌ద‌కు తెలుగుతో పాటు మ‌ల‌యాళంలో కూడా పెద్ద సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ఆమె ప‌క్కా మ‌ల‌యాళి అనే అక్క‌డి వారి అనుకుంటారు. అక్క‌డి వారెవ్వ‌రూ ఆమెను తెలుగు తార అనుకోరు. అంత‌గా ఆమె అక్క‌డ పేరు సంపాదించుకుంది. అందుకే ఆమెకు మ‌ల‌యాళి ఇండ‌స్ట్రీ త‌ర‌పున అనేక అవార్డులు గెలుచుకుంది.

Image result for sarada heroine

అయితే న‌టిగా ఓ వెలుగు వెలిగిన శార‌ద ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మీకు తెలియ‌ని ఎన్నో విష‌యాలు ఉన్నాయి. న‌టిగా అంద‌రిని ఆక‌ట్టుకున్న ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలో చీక‌టి కోణాలు ఎన్నో ఉన్నాయి. శార‌ద రెండు పెళ్లిళ్లు చేసుకుంది.

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!

వాటా