మీ గుండెకు వందేళ్ళు బరోసా ఇచ్చే 10 రకాల ఆహారాలు

0
247

మారు తున్న కాలాన్ని బట్టి జబ్బులు కూడా చాల తొందరగా వస్తున్నాయి .. చిన్న వయసులోనే వృద్ధాప్యంలో రావాల్సిన వ్యాధులు వస్తున్నందుకు నిజంగా.. చాల బాధ పడవలసిన విషయం ..ఇందుకు కారణం లైఫ్ స్టైల్, ఆహార నియమాలు, మానసిక ఒత్తిళ్లే .

ఏదైనప్పటికి దాని ప్రభావం గుండెపై పడుతుంది. రక్తపోటు పెంచి, గుండెపోటుకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో గుండెను పదిలపర్చుకోడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు డాక్టర్లు, సైకాలజిస్టులు, న్యూట్రిషనిష్టులు.

ఈ క్రింది వీడియో చూడండి.

సాధారణంగా మనం తీసుకునే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఇంధనంలా పని చేస్తుంది. ఆహారం మన శరీరానికి మూడు విధాలుగా ఉపయోగపడుతుంది. అవి శరీర నిర్మాణానికి, శక్తిని చేకూర్చడానికి, శరీర కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి. మన శరీరం పని చేయడానికి ఆహారం, నీరు అతి ముఖ్య మైన పోషకావసరాలు.

Image result for best food for good heart

మనం ఎంత తింటున్నామనేది మాత్రమే కాదు, ఏం తింటు న్నామనేది కూడా ముఖ్యమే. అన్ని రుచులు, పదార్థాలు కలిస్తేనే సంపూర్ణ ఆహారం అవుతుంది. కొన్ని పదార్థాలు కళ్లను కాపాడుకుంటే మరికొన్ని బలాన్నిస్తాయి. ఇంకొన్ని శరీరంలోని ఇతర భాగాలకు మంచి చేస్తాయి. అలాంటి వాటిలో గుండెకు మంచి చేసే పది రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం…

Image result for best food for good heart

చేపలు ఆరోగ్యానికి చాల మేలు చేస్తాయి అని అందరికి తెలిసిందే …. చేపలు తినడం వల్ల కంటి సమస్యలు రావు .. ఐతే సాల్మన్ చాపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ నరాల్లో రక్త సరఫరాను క్రమబద్ధం చేస్తాయి.గుండె ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. ఇవి శరీరంలో ఇమ్యునిటీ శక్తిని కూడా పెంపొందిస్తాయి. గుండెకు మంచి చేసే కొవ్వును పెంపొందిస్తాయి. అంతేకాదు శరీరంలో రక్తం గడ్డకట్టకుండా వుండేందుకు ఇది ఎంతో అవసరం..

Image result for best food for good heart

నట్స్: వాల్ నట్స్ వీటిలో పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి. విటమిన్ బి 1,2,3,6 మరియు ఇ, మినరల్స్ అయిన కాపర్, జింక్, కాల్షియం, మేంగనీస్, ఐరన్ వంటివి కూడా వుండి బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక కొల్లెస్టరాల్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్ నట్ ను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది

ఓట్స్ : చాల మంది తమ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఓట్స్ ని డైట్ లో చేర్చుకుంటున్నారు. ఐతే గుండెజబ్బుల నివారణకు ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిజంగా ఓట్స్ కి కొలెస్ట్రాల్ నియంత్రించే శక్తి ఉందా అంటే ఉందనే చెప్పాలి. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. ఇదే రకం పీచు పదార్థం బార్లీలో కూడా ఉంటుంది.

డార్క్ చాక్లెట్ :
చాక్లెట్ బార్ లో ఉన్న కొన్ని రసాయనాలు గుండె వ్యవస్థను సాఫీగా ఉంచుతాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ ముఖ్యముగా దాదాపు 50% గుండెపోటు,10% గుండె వ్యాధుల యొక్క ముప్పు తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఒక చాక్లెట్ బార్ ను తినవచ్చు. చాక్లెట్లులో ముఖ్యమైన పదార్ధంగా ఉన్న కోకో పౌడర్ లో తక్కువ కొవ్వు ఉంటుంది. చాక్లెట్లు అంటే ఇష్టపడే వారు బరువు పెరగకుండా ఉండటానికి తక్కువ కొవ్వు ఉన్న చాక్లెట్లు ఎంపిక చేసుకోవాలి. అలాని ఎక్కువగా తిసుకోకుండం ఒక పరిమితిలో తీసుకోవాలి.

సిట్రస్ పండ్లు:

నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ ఉంటాయి . వీటి వల్ల గుండెకు రక్త సరఫరా బాగా జరుగుతుంది.

సోయా బీన్స్:

గింజ దాన్యాలలో సోయా చాల ప్రత్యేకమైనది. కొన్ని రకాల జబ్బులను దరిచరనివ్వదు. త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చ్ను. శరీరానికి అవసరమైన అమినోయసిడ్లు, లైసీన్ ల కలిగి వుంటుంది . సోయద్వారా లబించే మాంసకృత్తులు-పాలు, మాంసము, కోడిగుడ్లతో సరిసమానము. గుండె ఆరోగ్యాన్ని కాపాడే మెగ్నీషియం, ఫైబర్ యాంటీఆక్సిడెంట్స్, ఫొల్లెట్ పుష్కలంగా ఉంటాయి .

టమోటో:
టమోటోలలో ఒక సీక్రెట్ ఉంటుంది .చాలా తక్కువ ఖరీదులో అరుదుగా దొరికేటటువంటి టమోటోలు లోఫాట్ ఆహారం. కాబట్టి అతి త్వరగా బరువును తగ్గించే ఆహార పదార్థాలల్లో తప్పనిసరిగా టమోటోలను చేర్చండి. శరీరానికి కావలసిన శక్తిని పొందండి. హర్ట్ రేట్ తగ్గించడంతో పాటు, గుండెలో మంటను తగ్గిస్తుంది. టమోటోలను రెగ్యులర్ గా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

బంగాళ దుంపలు శరీరానికి అవసరమయ్యే కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ రుచికరమైన, శక్తినందించే స్వీట్ పొటాటోను మీ డైలీ డైట్ లో చేర్చుకోండి. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. దాంతో పాటు ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా అనిపిస్తుంది.

Image result for tomato

దానిమ్మ:
గుండెపోటును నివారించడానికి సహాయపడే ఆహారపదార్ధాలలో దానిమ్మ కూడా ఒకటి. ఇందులో ఫైటో-న్యూట్రిఎంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే నైట్రిక్ ఆక్సైడ్ లను ఉత్తేజపరచడానికి సహాయపడతాయి.

వాటా