కండోమ్‌ లేని కాలంలో మన పూర్వీకులు ఏం వాడెవరో తెలుసా..

488

గర్భాన్ని నిరోధించే వాటిలో అందరికి తెలిసిన మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినది కండోమ్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కన్నా ఎక్కువ కండోమ్’లను తయారుచేసే బ్రాండులు అందుబాటులో ఉన్నాయి. సంభోగంలో కండోమ్ వాడకం తప్పనిసరి మరియు తృప్తిని కలిగించే, సురక్షిత పధ్ధతి అని చెప్పవచ్చు. లైంగిక సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా మరియు గర్భధారణను నిరోధించుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.అయితే ఈ కాలంలో అంటే గర్భం రాకుండ కండోమ్ ఉంది. మరి మన పూర్వీకులు కండోమ్ బదులుగా ఏం వాడేవారు. ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆధునిక కాలంలో గ‌ర్భాన్ని తొలగించుకోవడం కోసం స్త్రీల‌ు అబార్షన్ చేయించుకోవడం.. ఇంకా వేర్వేరు ప‌ద్ధతుల ద్వారా గర్భాన్ని తొలగించుకుంటున్నారు. కాని పూర్వకాలంలో అలా కాదు. ఆ కాలంలో దంప‌తులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడేసి, ఎనిమిదేసి… ఇంకొంద‌రు ప‌దుల సంఖ్య‌లో కూడా పిల్ల‌ల్ని క‌నేవారు. అప్పుడు జ‌నాభా నియంత్ర‌ణ‌, గ‌ర్భం రాకుండా నిరోధించ‌డం వంటి ప‌ద్ధ‌తుల‌పై అప్పటి ప్ర‌జ‌ల్లో స‌రైనా అవ‌గాహ‌న లేదు. కానీ కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే ఆ ప‌ద్ధతుల‌ను పాటించేవారు. వారి సంఖ్య కూడా చాలా త‌క్కువే. అయితే వారు గ‌ర్భం రాకుండా ఉండేందుకు అప్పటివారు ఉప‌యోగించిన ప‌ద్ధతుల‌ను చూస్తే ఇప్ప‌టి వారు ఖంగుతినాల్సిందే.

పూర్వం నిమ్మ‌కాయ తొక్క‌ల‌ను అప్ప‌ట్లో కొంద‌రు మ‌హిళ‌లు త‌మ జ‌ననాంగాల వ‌ద్ద పెట్టుకునేవార‌ట‌. దాంతో నిమ్మ‌ర‌సం ఆ ప్ర‌దేశ‌మంతా వ్యాపించి అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ అక్క‌డికి వచ్చి చేరే శుక్ర క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంద‌ట. దీంతోపాటు ఆ ప్ర‌దేశంలో ఉన్న బాక్టీరియా అంతా న‌శిస్తుంద‌ని కూడా వారు న‌మ్మేవారు. ఈ పద్ధతి వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని వారి నమ్మకం. అకాసియా అనే ఓ మొక్క‌కు చెందిన ఆకుల‌ను తేనె, ఖ‌ర్జూరం క‌లిపిన మిశ్ర‌మంలో నాన‌బెట్టి వాటిని టాంప‌న్స్ అని పిల‌వ‌బ‌డే బిర‌డాల వంటి స‌హాయంతో కొంద‌రు ఈజిప్షియన్‌ మ‌హిళ‌లు త‌మ యోనిలో పెట్టుకునేవార‌ట‌. ఈ ప‌ద్ధ‌తి వీర్యాన్ని నాశ‌నం చేసే స్పెర్మిసైడ్‌గా ప‌నిచేస్తుంద‌ని వారంటున్నారు. పంది పేగుల‌ను వేడి పాల‌లో నాన‌బెట్టి వాటిని శుద్ధి చేసి కొంద‌రు పురుషులు వాటిని కండోమ్‌లుగా అప్ప‌ట్లో ఉప‌యోగించేవార‌ట‌. వినడానికే వింతగా ఉన్న ఇది నిజం.ఇలా అప్పటికాలంలో గర్భం రాకుండా జాగ్రత్తపడేవారు.. మరి పూర్వకాలం గర్భం రాకుండా ఉండటానికి ఉపయోగించిన పద్దతుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.