భర్తకు 47 మంది పిల్లలని పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత తెలిసి ఈ భార్య చివరికి ఏం చేసిందో తెలిస్తే షాక్ ..!

170

భార్య, భర్తల మద్య విచిత్రమైన సంఘటనల వల్ల వివాదాలు తలెత్తుతాయి. చిన్న విషయాలకు కూడా భార్య భర్తలు విడిపోయేందుకు సిద్దం అవుతారు. ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్‌ వంటి పాశ్చాత్య దేశాల్లో ఈ వివాడాకులు అనేవి చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. తాజాగా ఇలాంటి విచిత్రమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.

తన భర్త నుండి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటీ అంటూ ఆమె సోషల్‌ మీడియాలో తన స్నేహితులను మరియు ఇతరులను అడిగింది. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం విడాకులు వద్దని చెప్పడం జరిగింది. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నది అనే విషయంపై ఇంకా క్లారిటీ లేనప్పటికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ అవుతోంది.

ఆ భర్తకు 47 మంది పిల్లలు ఉన్నారనే విషయం తెలిసి ఆ భార్య షాకైంది. ఇక అతనితో జీవితం కొనసాగించలేనని, విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే, ఇందులో ఆ భర్త తప్పు ఏమీ లేదు. అతను ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని పిల్లలను కనలేదు. ఆ పిల్లలంతా వీర్య దానం వల్ల పుట్టినవారే. కానీ, అతని భార్య మాత్రం దాన్ని తప్పుగానే భావిస్తోంది.

వీర్య దానం తప్పు కాకపోయినా.. అతడు చేసిన పనికి ఆ పిల్లంతా ‘నువ్వే మా నాన్న’ అంటూ ఇంటికి వస్తే ఏం చేయాలంటూ ఆమె సందేహిస్తోంది. అతనితో విడిపోవడం మంచిదా? కలిసి ఉండాలా అనే విషయం మీద పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీనిపై స్నేహితులు, బంధువుల అభిప్రాయాన్ని కోరుతూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్లు ‘మిర్రర్’ వార్తా సంస్థ వెల్లడించింది.

‘‘ఎనిమిదేళ్ల కిందట మాకు పెళ్లయ్యింది. మాకు ఒక బిడ్డ ఉంది. మేం డేటింగ్ చేస్తున్నప్పుడు తాను వీర్య దానం చేస్తున్నట్లు చెప్పాడు. అయితే, ఎన్నిసార్లు చేశాడనే విషయం చెప్పలేదు. ఏదో ఒకరిద్దరికి ఇచ్చి ఉంటాడని భావించాను. ఇక ఎవరికీ వీర్య దానం చేయొద్దని కూడా చెప్పాను. గత వారం మీరు ఎన్నిసార్లు వీర్య దానం చేశారని అడిగితే.. 47 అని చెప్పాడు’’ అని తెలిపింది.

‘‘ఆ రోజు నేను ఎంతమందికి వీర్య దానం చేశారని అడగకపోవడం నా తప్పే. కానీ, భవిష్యత్తులో ఆ పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఇతనే వారి తండ్రని తెలుస్తుంది. వారంతా మా జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు నేను నా భర్తకు విడాకులు ఇవ్వాలా? కలిసి ఉండాలా అర్థం కావడం లేదు’’ అని తెలిపింది.

అయితే, చాలామంది భర్తను వదలవద్దనే ఆమెకు సలహాలిచ్చారు. ‘‘నీ భర్త ఎవరితోనే నేరుగా శృంగారంలో పాల్గోలేనప్పుడు అతన్ని దోషిగా ఎందుకు చూస్తావు? అందులో అతని తప్పు లేదు. ఈ చిన్న విషయానికే మీ బంధాన్ని తెంచుకుంటావా? అతడు నీకు తెలియకుండా వీర్య దానం చేయలేదు కదా?’’ అని తెలిపాడు. మరి, మీరేమంటారు? ఆమె అతడికి విడాకులు ఇవ్వాలా వద్దా?

47 మంది పిల్లలున్న భర్త పై ఆ భార్య ఫిర్యాదుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి..