పురుషుల వీర్య కణాలపై లోదుస్తుల ప్రభావం ఎంతో ప్రతీ మగాడు తెలుసుకోవాలి

928

చాలా మంది వ‌దులుగా ఉండే దుస్తులు ధ‌రించాల‌ని చూస్తే కొంద‌రు టైట్ అలాగే స్కిన్ ఫిట్ బ‌ట్ట‌లు వేసుకుంటారు.. ఇలాంటివి వేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చాలా క్రియ‌ల‌కు డ్యామేజ్ జ‌రుగుతుంది.. ముఖ్యంగా పురుషులు లో దుస్తులు ఇలాంటి టైట్ గా ఉండేవి వేసుకుంటే వారి వీర్య‌క‌ణాల వృద్ది జ‌రుగ‌దు అని ఓ విష‌యం చెబుతారు.. మ‌రి ఇది ఎంత వ‌ర‌కూ నిజం ఇందులో ఎంత వాస్త‌వం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం

డాక్ట‌ర్లు చెప్పేదాని ప్ర‌కారం లోదుస్తులు బిగుతుగా ఉండేవి ధ‌రిస్తే, వారికి సంతాన‌ప్రాప్తి క‌ల‌గ‌క‌పోవ‌డానికి ముఖ్య కార‌ణం అవుతుంది అని అంటున్నారు.. చాలా మంది బాక్స‌ర్లు వాడితే మ‌రికొంద‌రు బ్రీఫ్స్ జాకీలు వేసుకుంటారు.. వీటి వ‌ల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా బాక్స‌ర్స్ ఎవ‌రు అయితే వాడ‌తారో వారిలో స్పెర్మ్ కౌంట్ అధికంగా ఉంద‌ని, మిగిలిన వారిలో 15 శాతం వృద్ది క‌నిపిస్తే బాక్స‌ర్లు వాడేవారిలో 80 శాతం వృద్ది క‌నిపించింది అని చెబుతున్నారు డాక్ట‌ర్లు.. అందుకే పురుషులు బాక్స‌ర్లు వాడాలి అని చెబుతున్నారు.

లోదుస్తులు వీర్య‌కాణాల‌పై ప్ర‌భావం చూపించి సంతాన‌ప్రాప్తి క‌ల‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం అవుతాయ‌ని దీనివ‌ల్ల స్పెర్మ్ కౌంట్ త‌గ్గుతుంది అని అంటున్నారు…తాజాగా దీనిపై హ్యూమ‌న్ రిప్రొడ‌క్ష‌న్ జ‌ర్న‌ల్ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది…వీరు 666 మంది పురుషుల‌పై స‌ర్వే చేశారు.. వీరిలో బాక్స‌ర్స్ వాడేవారిలో స్పెర్మ్ కౌంట్ అధికంగా ఉంద‌ని తెలియ‌చేశారు. అయితే వీర్య‌వృద్ది ఒక్కోవారం ఒక్కోలా ఉంటుంది కాబ‌ట్టి, దీనిపై కంగారు ప‌డ‌వ‌ద్ద‌ని లోదుస్తులు మ‌రీ టైట్ గా లేనివి వాడాలి అని యూరాల‌జిస్టులు తెలియ‌చేస్తున్నారు. మ‌రి చూశారుగా ఇలా ఫాలో అవ్వండి.. టైట్ ఎప్పుడూ దేనికైనా ఇబ్బందే అనేది గుర్తు ఉంచుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.