‘వినయ విధేయ రామ’ రివ్యూ కన్నీరు పెట్టుకున్న చిరంజీవి అభిమానులు

640

రాముడొచ్చాడు.. సంక్రాంతి పండక్కి థియేటర్స్‌లో సందడి చేసేందుకు సీతతో కలిసి వినయ విధేయ రాముడు వచ్చాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్, కైరా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించిన ‘వినయ విధేయ రామ’ భారీ అంచనాల నడుమ నాడు థియేటర్స్‌‌లో విడుదలైంది.రంగస్థలం’ సినిమాతో చిట్టిబాబు పాత్ర ద్వారా తన నటనపై అప్పటివరకూ ఉన్న ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలు, విమర్శలకు చెక్ పెట్టేశారు రామ్ చరణ్. ఈ చిత్రంలో తెలుగు హిస్టరీ రికార్డ్స్‌ని కదిలించి మెగా వారసుడిగా సత్తా చాటాడు చిట్టిబాబు.

Image result for vinaya vidheya rama photos

ఈ చిత్రం తరువాత మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లతో ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా రామ్ చరణ్‌ను చూపించారు యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. పండక్కి పక్కా హిట్ అనే ధీమాను మెగా అభిమానుల్లో కలిగించారు. ఇక రామ్ చరణ్ కెరియర్‌లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ నడిపిన సినిమాగా విడుదలకు ముందే రికార్డ్ క్రియేట్ చేసింది వినయ విధేయ రామ.మెగా పవన్ స్టార్ రామ్ చరణ్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో చూపించారు బోయపాటి. ఉగ్రనరసింహుడి అవతారం ఎత్తి ‘రామ్.. కొ.. ణె.. దె.. ల’ అంటూ గర్జిస్తూ మెగా ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్ మూవీ ఇప్పటికే పలు చోట్ల ప్రదర్శితం కావడంతో సినిమా పై త‌మ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు ప్రేక్షకులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

చాలా సెంటర్లలలో వినయ విధేయ రాముడు కుమ్ముయడం ఖాయమే అంటున్నారు. ఫస్టాఫ్ బాగుందని.. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ సీన్ చాలా ఉన్నాయంటున్నారు. బోయపాటి మార్క్ డైరెక్షన్ మూవీగా మంచి మసాలా అద్దారని.. యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉన్నాయంటున్నారు. రామ్ చరణ్ ఫైట్స్ ఇరగదీశాడని.. కైరా కాంబినేషన్‌లో స్టెప్పులు అదరగొట్టాడంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని.. వార్నింగ్ సీన్ కేక పెట్టించిందంటున్నారు. మరోవైపు మాస్ కు ఈ సినిమా మ‌రో సారి క్లాస్ గా వ‌సూళ్లు దిశ‌గా వెళుతుంది అని కూడా చెబుతున్నారు. అలాగే పాట‌లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి అని తెలుస్తోంది.. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి చ‌ర‌ణ్ ని స‌రికొత్త‌గా చూపించాడు అంటున్నారు. మ‌రి ఈసినిమాచూసిన వారు మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.