గీత గోవిందం మూవీ రివ్యూ

474

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన చిత్రం గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రంపై యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. ట్రైలర్ ఆకట్టుకోవడం, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో యూత్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రీమియర్ షోల‌లో ఇప్ప‌టికే మంచి టాక్ వ‌చ్చింది… ఈసినిమాకి సంగీతం గోపి సుందర్ అందించారు… విజయ్ దేవేరుకోండ , రష్మిక మందాన, నాగేంద్ర బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.. ఓ సారి ఈస్టోరీ గురించి క్లుప్తంగా తెలుసుకుంటే..

అన్నవరంలో ఈ సినిమా కథ మొదలవుతుంది. నిత్య మీనన్ కి విజయ్ దేవరకొండ తన లైఫ్ స్టోరీ ని చెప్తూ ఉంటాడు…తన భార్య ఎలా ఉండాలి అనుకుంటున్నాడో చెప్తాడు . తర్వాత గీత గోవిందం ని కలుస్తుంది. ఇద్దరు కలిసి ఒకే బస్సు లో ప్రయాణం చేస్తారు. లవ్ టిప్స్ ఇచ్చే ఫ్రెండ్ రా రాహుల్ రామకృష్ణ పరిచయం అవుతాడు. గోవిందం ను గీత అపార్ధం చేసుకొని మంచి వాడు కాదు అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు అనుకోని దూరం పెడుతుంది. చివరికి గోవిందం మంచితనం గురించి గీతకు తెలుస్తుంది.. త‌ర్వాత వారిద్ద‌రూ క‌లిసి ట్రావెల్ చేసిన జీవితం తెర‌పై క‌నిపిస్తుంది అదే ఈ చిత్రం..

ప్రస్తుతం తెలుగులో మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. తనదైన నటన, డైలాగ్ డెలివరీతో విజయ్ యువతకు బాగా దగ్గరైపోయాడు. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్‌కు స్టార్‌డమ్ వచ్చి పడింది. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే యువతలో ఆసక్తి పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది….సినిమా విడుదలకు ముందే కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీకవడం కలంకలం రేపింది. దీంతో గత నాలుగు రోజులుగా తెలుగు మీడియా, సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. అయితే ఒకరకంగా దీనివల్ల సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఈ లీక్ మూలంగా సినిమాకు బజ్ పెరిగిపోయింది

సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కామెడీ అదరిపోయిందని, విజయ్ దేవరకొండ వన్‌మ్యాన్ షో అని కొనియాడుతున్నారు. చివర్లో వెన్నెల కిషోర్ కామెడీతో అదరగొట్టాడు.విజయ్, రష్మిక కెమెస్ట్రీ బాగా కుదిరిందట. ఒక సాధారణ కథని వీరిద్దరూ హిట్టు బొమ్మగా మార్చేశారని అంటున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గీత గోవిందం’ పాజిటివ్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తోంది… ఈసినిమాకు మేజ‌ర్ గా విజ‌య్ న‌ట‌న డైలాగ్స్ చాలా బాగున్నాయ‌ని అలాగే ర‌ష్మిక గ్లామ‌ర్ తో యూత్ ని బాగా ఆక‌ట్టుకుంటుంది అని అంటున్నారు.. కామెడీ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ అయ్యాయి అని రివ్యూయిస్టుల అభిప్రాయం… సెకండాఫ్ కాస్త నెమ్మ‌దించినా సినిమా చూడ‌టానికి వ‌చ్చిన ఏ ఒక్క ప్రేక్ష‌కుడు నిరుత్సాహంగా వెళ్ల‌డు అనేది ఈ చిత్రం ఫైన‌ల్ బాట‌మ్ లైన్…. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు గీత‌గోవిందంతో మ‌రో హిట్ త‌న చిత్రాల ఖాతాలో ప‌డినేట్టే.