నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ

430

నిర్మాణ సంస్థ‌: సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్‌
తారాగ‌ణం: సుధీర్‌బాబు, న‌భా న‌టేశ్‌, నాజ‌ర్‌, తుల‌సి, సుద‌ర్శ‌న్, పృథ్వీ, జీవా, వైవా హ‌ర్ష‌ త‌దిత‌రులు
సంగీతం: అజ‌నీశ్ లోక్‌నాథ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: సురేశ్ ర‌గుతు
కూర్పు: ఛోటా కె.ప్ర‌సాద్‌
నిర్మాత : సుధీర్‌బాబు
ద‌ర్శ‌క‌త్వం : ఆర్‌.ఎస్‌.నాయుడు

Image result for nannu dochukunduvate posters

సుధీర్ బాబు సినిమాలు అంటేనే స‌మ్మోహ‌నం నుంచి స‌రికొత్త ఒర‌వ‌డి వ‌చ్చింది, అలాగే ఆయ‌న సినిమాల‌ను ఆద‌రిస్తున్నారు..సుధీర్‌బాబు స్వ‌త‌హాగా కోటీశ్వ‌రుడు. తెలుగు ఇండస్ట్రీలో సూప‌ర్‌స్టార్‌గా అంద‌రూ ముద్దుగా పిలుచుకునే కృష్ణ‌కు మూడో అల్లుడు. స్వ‌త‌హాగా బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌. అయినా న‌ట‌న మీద ఆయ‌న‌కు ఉన్న ఆస‌క్తి మెండు. అందుకే ఆయ‌న సినిమా న‌ట‌న‌లో అడుగులు వేశారు. ఇటీవ‌ల కూడా `స‌మ్మోహ‌నం`తో సూప‌ర్‌హిట్ అందుకున్నారు. తాజాగా ఓ సంస్థ‌ను పెట్టి త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల‌ను నిర్మించాల‌నుకున్నారు. ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా ఆయ‌న వేసిన తొలి అడుగే `న‌న్ను దోచుకుందువ‌టే`. పేరులోనే ప్రేమ సినిమా అని తెలిసి పోతున్న ఈ సినిమా ఈ త‌రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందా? కొత్త బ్యాన‌ర్‌లో తొలి సినిమా కాబ‌ట్టి కొత్త‌గా ఉంటుందా? ఓసారి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం

Image result for nannu dochukunduvate posters

క‌థ‌:
కార్తిక్ (సుధీర్‌బాబు) సాఫ్ట్ వేర్ ఇండ‌స్ట్రీలో ప‌నిచేస్తుంటాడు. యు.ఎస్‌.వెళ్లాల‌న్న‌ది అత‌ని గోల్‌. త‌న టీమ్ మొత్తానికి అత‌నంటే సింహ స్వ‌ప్నం. ఎలాంటి టార్గెట్ని అయినా అత‌ను చాలా తేలిగ్గా కంప్లీట్‌చేస్తాడు. ప్రేమా, పెళ్లి మీద పెద్ద ఒపీనియ‌న్ ఉండదు. దాంట్లో త‌న మేన‌మామ చెప్పిన ఓ ప్ర‌పోజ‌ల్‌ను అంగీక‌రిస్తాడు. అయితే అత‌ని మ‌ర‌ద‌లికి వేరే వ్య‌క్తితో ప్రేమ వ్య‌వ‌హారం ఉంద‌ని తెలిసి.. తాను మ‌రో అమ్మాయిని ప్రేమిస్తున్న‌ట్టు తండ్రితో చెబుతాడు. తాను ప్రేమించే సాఫ్ట్ వేర్ అమ్మాయి సిరి గా మేఘ‌న (న‌భా న‌టేష్‌)ని ప‌రిచ‌యం చేస్తాడు. మేఘ‌న ఓ వైపు కాలేజీ చ‌దువుతూ మ‌రోవైపు షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తుంటుంది. క్ర‌మంగా కార్తిక్ ప్రేమ‌లోప‌డుతుంది సిరి. అయితే ఆ విష‌యాన్ని చెప్పేలోపు అత‌ని వేరే మార్గం మీద దృష్టి పెడుతున్నాడ‌ని తెలుసుకుంటుంది. మ‌రో సంద‌ర్భంలో అత‌ను రియ‌లైజ్ అయ్యే స‌మ‌యానికి సిరి వేరే క‌మిట్‌మెంట్ చేసుకుంటుంది. మ‌రి ఒక‌రి మీద ఒక‌రికి ప్రేమ ఉన్న‌ప్ప‌టికీ వాళ్లు విడివిడిగా బ‌తుకుతారా? లేకుంటే ఒక‌రినొక‌రు ఏదో ఒక సంద‌ర్భంలో అర్థం చేసుకుంటారా? నిజంగా అర్థం చేసుకుంటే వాళ్ల‌కు స‌హ‌క‌రించిన అంశాలేంటి? వ‌ంటివి ఆస‌క్తిక‌రం.

Image result for nannu dochukunduvate posters

ప్ల‌స్ పాయింట్స్‌:
న‌టీన‌టుల ప‌నితీరు
వైవా హ‌ర్ష కామెడీ ట్రాక్‌
కెమెరా వ‌ర్క్‌

!!మైన‌స్ పాయింట్స్‌!!
క‌థ‌లో కొత్త‌దనం లేదు
సెకండాఫ్

ఈ క్రింద వీడియో మీరు చూడండి

క‌థ క‌థ‌నం ప్ర‌కారం సినిమా అద్బుతంగా ఉంది అనే చెప్పాలి… సుధీర్ బాబు న‌ట‌న అమోఘం ఇక హీరోయిన్ గా న‌భాన‌టేష్ హావ‌భావాలు మాట సినిమాకు చాలా ప్ల‌స్ అయ్యాయి ఇక సినిమా క‌థ నేచురల్ గా తెర‌కెక్కించిన అనుభూతి క‌లుగుతుంది, నిర్మాణ విలువ‌లు బాగున్నాయి, నేప‌థ్య సంగీతం బాగుంది, ఇక వైవా హ‌ర్ష కామెడి సినిమాకు ప్ల‌స్ అయింది. మొత్తానికి స‌మ్మోహ‌నం త‌ర్వాత మ‌రో అద్బుత మైన సినిమాని ఆయ‌న ఇచ్చారు అనే చెప్పాలి త‌న తొలి బ్యాన‌ర్ లో.